Flax seeds for Hair: జుట్టు ఆరోగ్యానికి అవిసె గింజలు.. ఇలా వాడితే నమ్మలేని కేశ సౌందర్యం మీ సొంతం..
Flax seeds for Hair: జుట్టు ఆరోగ్యానికి అవిసె గింజలు.. ఇలా వాడితే నమ్మలేని కేశ సౌందర్యం మీ సొంతం..పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన అవిసె గింజలను ఫ్లాక్స్ అని కూడా పిలుస్తారు.
అవి ప్రోటీన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియంతో నిండి ఉంటాయి. ఇవి మన మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి. అవిసె గింజలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కేశ సంరక్షణకు కూడా చాలా మంచిది.
స్తుత కాలంలో వాతావరణంలో ఉన్న పొల్యూషన్ అలాగే సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం వంటి అనేక రకాల కారణాలతో చుండ్రు, జుట్టు రాలే సమస్య ఎక్కువైంది. ఈ సమస్యలు రాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే హెయిర్ ఆయిల్., సీరంలను వాడుతూ ఉంటారు.
వీటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా ఉండే వస్తువులతో చాలా సులభంగా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. దీనికోసం ఒక గిన్నెలో ఒక స్పూన్ అవిసె గింజలు., ఒక స్పూన్ మెంతులు, ఐదు ఎర్ర గులాబీ పువ్వుల రేకలు, రెండు గ్లాసుల నీటిని పోసి పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక పావుగంట మరిగించాలి.
ఇలా మరిగాక చల్లార్చుకుని ఒక పలుచని క్లాత్ సాయంతో ఈ నీటిని వడకట్టాలి. ఇలా వచ్చిన సీరంను ఒక స్ప్రే బాటిల్ లో వేసుకోవాలి. ఈ సీరంను రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా స్ప్రే చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత Cap పెట్టుకుని మరుసటి రోజు ఉదయం కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.
తలకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. అవిసె గింజల్లో విటమిన్-బి సమృద్దిగా ఉండుట వలన జుట్టుకు బలం చేకూర్చడంతో పాటు జుట్టు పొడిబారకుండా తేమగా ఉండేలా చేసి సిల్కీగా ,మెరిసేలా చేస్తుంది.
మెంతులు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడుతుంది. గులాబీ రేకలు డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. అలాగే జుట్టుకు మంచి షైనింగ్ , వాల్యూమ్ ను పెంచుతుంది. తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/