Beauty Tips

Multani Mitti Benefits : మీ చర్మం మెరిసిపోవాలంటే ముల్తానీ మట్టిని ఉపయోగించే పద్ధతులు ఇవే

Multani Mitti Benefits : మీ చర్మం మెరిసిపోవాలంటే ముల్తానీ మట్టిని ఉపయోగించే పద్ధతులు ఇవే.. ముఖం అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే ఇందుకోసం కొన్ని సహజ పద్ధతులను పాటించాలి. అందులో ఒకటి ముల్తానీ మట్టి.

మీ చర్మం కాంతివంతంగా, మృదువుగా మరియు అందంగా ఉండటానికి క్రీమ్‌ లను రాస్తే సరిపోదు. చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యం. ప్రతి ఒక్కరూ ముఖం అందంగా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు.

దీని కోసం 15 రోజులకు ఒకసారి బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ఖరీదైన చికిత్సలు చేయించుకుంటున్నారు. అయితే కొన్నిసార్లు బిజీ లైఫ్ స్టైల్ కారణంగా బ్యూటీ పార్లర్ కి వెళ్లేంత సమయం దొరకదు.అటువంటి పరిస్థితులలో, ఇంట్లో కూడా చాలా సులభమైన చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల ముల్తానీ మిట్టి కొద్దిగా రోజ్ వాటర్ తీసుకుని మందపాటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి, ఆరిపోయే వరకు ముఖంపై ఉంచండి. ఈ ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత, మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.

ముల్తానీ మిటీ మొటిమలను తగ్గించడమే కాకుండా, ఓపెన్ రంధ్రాలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఓపెన్ రంధ్రాల నుండి అదనపు నూనె మరియు మురికిని కూడా తొలగిస్తుంది.

ముల్తానీ మిట్టిని అప్లై చేయడం వల్ల ముఖం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ముల్తానీ మట్టి అప్లికేషన్ వదులుగా తెరిచిన రంధ్రాలను బిగించడానికి సహాయపడుతుంది. ముఖానికి మెరుపు వస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను అప్లై చేయడం వల్ల చర్మంపై మచ్చలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ ప్యాక్ వేసుకొని ముఖం మెరిసేలా చేసుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.