Beauty Tips

Hair Care Tips:జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారా? ఈ మాస్క్ తో అన్నీ క్లియర్

Hair Care Tips:జుట్టు సమస్యలతో బాధ పడుతున్నారా? ఈ మాస్క్ తో అన్నీ క్లియర్.. మీకు జుట్టు సమస్య ఉందా? డాండ్రఫ్ పట్టి వేధించడం, జుట్టు రాలిపోతుండటం, వెంట్రుకలు చిట్లిపోతుండటం లాంటి సమస్య ఏదైనా సరే అన్ని సమస్యలకు ఈ మాస్క్ చెక్ పెడుతుంది.

ఈ మధ్య కాలంలో మారిన వాతావరణ పరస్థితి, కాలుష్యం, ఎక్కువ రసాయనాలు ఉన్న షాంపూ వాడటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకి సంబందించిన సమస్యలు వస్తున్నాయి.

జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా జుట్టు రాలకుండా ఉండటానికి మార్కెట్లో దొరికే రక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేకాకుండా వేల కొద్ది డబ్బు ఖర్చు అవుతుంది. అయినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అందువల్ల మనం కాస్త శ్రద్ద పెట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.

జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి ఇప్పుడు చెప్పే చిట్కా బాగా సహాయపడుతుంది. ఒక బౌల్లో ఒక గ్లాసు గంజి తీసుకోవాలి. గంజి అంటే అన్నం వండి వార్చినప్పుడు వచ్చే నీటిని గంజి అంటారు. ఈ గంజి నీటిలో ఒక స్పూను అవిసె గింజలు వేసి ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం నానిన అవిసె గింజలను, గంజి నీటితో సహా మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

దీనిలో రెండు స్పూన్ల మునగాకు పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి. గంట తర్వాత హెర్బల్ షాంపూ లేదా కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

చుండ్రు, తలలో దురద వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాస్త శ్రద్ధగా ఓపికగా ఇంటి చిట్కాలను పాటిస్తే ఏటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News