Healthhealth tips in telugu

Honey Soaked Dates: తేనెలో ఖర్జూరాలను నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా?

Honey Soaked Dates: తేనెలో ఖర్జూరాలను నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా.. ఖర్జూరాల్లో నేచురల్ షుగర్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఎన్నో తీపి వంకాలను తయారుచేయడానికి కూడా చాలా మంది ఉపయోగిస్తారు. కొంతమంది అలాగే తింటుంటారు. అయితే ఈ ఖర్జూరాలను మీరు అలాగే కాకుండా తేనెలో నానబెట్టి తింటే ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.

ఖర్జూరంలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తేనెలో కూడా ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. ఒక గాజు సీసాలో మూడు వంతులు తేనెను పోసి దానిలో ఒక వంతు గింజ తీసిన ఖర్జూరం వేసి బాగా కలపాలి.
Health Benefits of Dates
బాగా కలిపిన తర్వాత మూతపెట్టి వారం రోజులు కదలకుండా ఉంచాలి. వారం తర్వాత రోజుకు ఒకటి లేదా రెండు చొప్పున తినాలి. ఇలా తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారు రాత్రి సమయంలో తింటే పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే గ్యాస్,ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
dates and honey
కాల్షియం, ఐరన్‌ సమృద్దిగా ఉండుట వలన మెదడు చురుగ్గా పనిచేసి మెమొరీ పవర్ పెరుగుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా ఎముకలకు సంబందించిన సమస్యలు ఉండవు. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి వంటివి తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఆకలి లేనివారిలో ఆకలిని పెంచుతుంది. ఉదయం సమయంలో తీసుకుంటే అలసట,నీరసం,నిసత్తువ వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. వీటిని తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News