Beauty Tips

Teeth Whitening : ఇలా చేస్తే పళ్ళపై పసుపు మరకలు పోయి తెల్లగా మెరుస్తాయి..

Teeth Whitening : ఇలా చేస్తే పళ్ళపై పసుపు మరకలు పోయి తెల్లగా మెరుస్తాయి.. ఎదుటివారిని చూడగానే వారి చిరునవ్వుని ఆకర్షిస్తుంది. అలాంటప్పుడు దంతాలు తెల్లగా మెరిస్తే ఆ అందం రెట్టింపు అవుతుంది. మరి పళ్ళు తెల్లగా మెరిసేందుకు ఏం చేయాలో చూద్దాం.

మనలో ప్రతి ఒక్కరూ పళ్ళు తెల్లగా మెరిసిపోవాలని అనుకుంటారు. పళ్ళు తెల్లగా మెరిస్తే ముఖం అందం రెట్టింపు అవుతుంది. పళ్ళు తెల్లగా మెరవటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చులో కేవలం రెండు ఇంగ్రిడియన్స్ ఉపయోగించి తెల్లని మెరిసే దంతాలను సొంతం చేసుకోవచ్చు.

ఈ చిట్కా కోసం ఒక బౌల్ లో ఒక స్పూన్ పసుపు, సరిపడా కొబ్బరి నూనె వేసి బాగా కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని బ్రష్ కి అప్లై చేసి బ్రష్ చేయాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే క్రమంగా దంతాల పైన ఉండే గార,పసుపు రంగు తొలగిపోయి తెల్లగా మెరుస్తాయి. ఇలా చేయటం వలన నోట్లో ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి.

పసుపులో యాంటీ-ఇంఫ్లామేటరీ, క్రిమినాశక మరియు యాంటీబయాటిక్ లక్షణాలు, కర్కుమిన్ సమ్మేళనం ఉండుట వలన పంటిపై గారను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఇది బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే యాసిడ్స్ ను తటస్థం చేయడం ద్వారా ప్లాక్యూ ను తొలగిస్తుంది. ప్లాక్యూ ఏర్పడటం వల్ల దంతక్షయం, చిగుళ్ళ వ్యాధి వస్తాయి.

కొబ్బరి నూనె నోటి ఆరోగ్యానికి ఉపయోగపడే మరో అద్భుతమైన ఔషధం. దీన్ని తరచుగా ఆయిల్ పుల్లింగ్‌లో ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది బ్యాక్టీరియాను బయటకు తీస్తుంది. అలాగే పంటి నొప్పి, నోటి దుర్వాసన, పళ్ళ సెన్సిటివిటీ మరియు చిగుళ్ల వ్యాధి వంటి సమస్యలకు చికిత్స చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News