Beauty Tips

White hair: చిన్న వయసులోనో తెల్ల వెంట్రుకల సమస్యా? ఇలా చేయండి

White hair: చిన్న వయసులోనో తెల్ల వెంట్రుకల సమస్యా? ఇలా చేయండి.. ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిని ఇంటి చిట్కాలతో సులభంగా తగ్గించుకోవచ్చు.

ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య అనేది వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది. తెల్లజుట్టు చాలా చిన్న వయసులోనే రావటం వలన కాస్త కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల hair dye లు వాడేస్తుంటారు. అయితే ఇలా హెయిర్ డ్రై వాడటం వల్ల జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా మన ఇంటి చిట్కాల ద్వారా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఒక బౌల్ లో పావు కప్పు ఆవనూనె తీసుకొని దానిలో ఒక స్పూన్ టీ పొడి, ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ బొగ్గు పొడి వేసి బాగా కలిపి డబుల్ బాయిలింగ్ పద్దతిలో వేడి చేయాలి. ఈ నూనెను జుట్టుకి బాగా పట్టించాలి.

అరగంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. కాస్త ఓపికగా చేస్తే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ఆవనూనె తెల్లజుట్టుకి కారణం అయిన మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. కాఫీ పొడి డైయింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.

టీ పొడిలో కెఫీన్, లాక్టిక్ యాసిడ్ డైయింగ్ ఏజెంట్ గా పనిచేసి తెల్లని జుట్టు నల్లగా మారటానికి సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది. ఈ చిట్కా ఫాలో అయితే జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్య కూడా తగ్గుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News