Weight Loss Recipe: శరీర బరువును తగ్గించే మసాలా రోస్టెడ్ ఫూల్ మఖానా రెసిపీ..
Phool Makhana Recipe For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా ఆహారాలను డైట్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డైట్ లో భాగంగా మసాలా రోస్టెడ్ ఫూల్ మఖానాను తీసుకుంటే సులభంగా మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడం అయితే స్పీడ్ గా జరిగిపోతుంది. అదే తగ్గాలంటే చాలా కష్టం అవుతుంది. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఏవి పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. .
అయితే ఇంటి చిట్కాలను ఫాలో అయితే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే బరువు చాలా తొందరగా తగ్గవచ్చు. బరువు తగ్గితే ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు. మార్కెట్లో బరువు తగ్గటానికి శరీరంలో కొవ్వును కరిగించడానికి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడటం వల్ల పలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది.
అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలు ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గవచ్చు. ఇప్పుడు బరువును తగ్గించుకోవటానికి ఒక రెసిపి తయారుచేస్తున్నాం. ప్రతి రోజు తీసుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఎలా తయారుచేయాలో చూద్దాం.
పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడి అయ్యాక అరస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగాక ఒక కప్పు పూల్ మఖాన వేసి ఒక నిమిషం అయ్యాక ఒక స్పూన్ వేపిన శనగలు, ఒక స్పూన్ వెగించిన వేరుశనగ గుళ్ళు, అరస్పూన్ ఎండుకొబ్బరి తురుము వేసి 5 నిమిషాల పాటు వెగించి ప్లేట్ లోకి తీసుకొని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కానీ సాయంత్రం స్నాక్ గా గాని తీసుకోవచ్చు.
ఈ రెమిడీ కోసం ఉపయోగించిన ఫుల్ మఖానా ఒకప్పుడు చాలా తక్కువగా ఫుల్ మఖానా లభించేది. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ విరివిగా లభిస్తుంది. ఫుల్ మఖానాలో ఉన్న పోషకాలు బరువు తగ్గించటానికి చాలా బాగా సహాయపడతాయి. వీటిని తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.
కరివేపాకు బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు నిల్వలను కరిగించడానికి కరివేపాకు చాలా చక్కగా పనిచేస్తుంది. జీలకర్ర తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావటానికి బాగా సహాయపడి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. ఈ రెసిపి బరువు తగ్గించటానికి సహాయపడటమే కాకుండా కీళ్లనొప్పులు, అలసట,నీరసం వంటి వాటిని కూడా తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News