Coffee Powder for Hair: చిటికెడు కాఫీ పొడితో.. తెల్ల జుట్టు మాయం!
Coffee Powder for Hair: చిటికెడు కాఫీ పొడితో.. తెల్ల జుట్టు మాయం.. జుట్టు పొడుగా, ఒత్తుగా ఉండాలని అందరూ ఉండాలి. జుట్టు సంరక్షణ కోసం ఎన్నెన్నో ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఆ ప్రాడెక్ట్స్ అందరికీ పడవు. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువే. ఇంకా అనేక రకాల జుట్టు సమస్యలు ఏర్పడవచ్చు.
మీ జుట్టు ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మార్కెట్లోకి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి కొనాల్సి పని లేదు. కాస్త సమయం తీసుకుని ఇంట్లో ఉండే వస్తువులతోనే మీ జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.
అందలోనూ మారిన ఈ కాలంలో చిన్న వయసులోనే చాలా మంది తెల్ల జుట్టుతో బాధ పడుతూ ఉంటారు. ఈ వైట్ హెయిర్ కవర్ చేసేందుకు డైలు ఉపయోగిస్తారు. వీటితో క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కాఫీ పౌడర్ చక్కగా ఉపయోగ పడుతుంది.
జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా తెల్లజుట్టు సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరి.
ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారిపోతుంది. దాంతో కంగారూ పడి మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వలన తాత్కాలికంగా ఫలితం ఉన్న జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం వస్తుంది.
ఈ చిట్కా కోసం ఒక బౌల్ లో ఒక స్పూన్ మెంతి పొడి, పావు స్పూన్ మిరియాల పొడి, చిన్న స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ షాంపూ, ఒక స్పూన్ Coconut Oil వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేయలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే ఫలితం తొందరగా వస్తుంది.
అయితే తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం, తక్కువ తెల్లజుట్టు ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కా పాటిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News