Saggubiyyam Idli : ఉదయం ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ చేయాలా? సగ్గుబియ్యంతో ఇడ్లీ ట్రై చేయండి
Saggubiyyam Idli : ఉదయం ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ చేయాలా? సగ్గుబియ్యంతో ఇడ్లీ ట్రై చేయండి.. సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంత మంచిదో కదా. అలాంటి సగ్గుబియ్యంతో ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
తేలికైన ఆరోగ్యరకమైన అందరూ తినే,టిఫిన్ ఐటెమ్స్ లో ఇడ్లీదే ప్రధమ స్థానం. దానికి మించిన ఆహారం ఇంకొకటి లేదనే చెప్పాలి. ఇడ్లీ రవ్వతోనే కాదు, సగ్గుబియ్యంతో కూడా, మృదువైన ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం.
కావాల్సిన పదార్ధాలు
సన్నని సగ్గుబియ్యం -1 కప్పు
పెరుగు – 1 కప్పు
ఇడ్లీ రవ్వ -1 కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర – 1/2కప్పు
తయారీ విధానం
1.ముందుగా సగ్గుబియ్యాన్ని బాగా కడిగి వేడినీటిలో 15 నిముషాల నానబెట్టాలి.
2.15 నిముషాల తర్వాత నానిన సగ్గుబియ్యాన్ని, ఒక గిన్నెలోకి తీసుకుని,అందులోకి ఇడ్లీ రవ్వ, పెరుగు, కొత్తిమీర, వేసి కలుపుకుని 5 నిముషాల పక్కనపెట్టండి.
3.ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ కు నూనె లేదా నెయ్యి రాసి , ఇడ్లీలా వేసుకోవాలి
4.వేసుకున్న ఇడ్లీ పేట్స్ ను నీటిలో పెట్టి, ఆవిరితో ఉడికించుకోవాలి
5.అంతే మెత్తటి సగ్గుబియ్యం ఇడ్లీ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News