Egg benefits:ఏ రంగు గుడ్డు మంచిది.. తెలుపు లేదా గోధుమ వర్ణం గుడ్డా?
Eggs:ఏ రంగు గుడ్డు మంచిది.. తెలుపు లేదా గోధుమ వర్ణం గుడ్డా.. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందించే పదార్థం కోడి గుడ్లు. అయితే శరీరానికి గోధుమ రంగు గుడ్డు తింటే మంచిదా తెలుపు రంగు గుడ్డు మంచిదా అని అందరికీ డౌట్ వస్తుంది కదా..!
Egg Benefits : కోడిగుడ్లలో ఎంతటి పౌష్టికాహారం ఉంటుందో అందరికీ తెలిసిందే. వాటిలో మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు లభిస్తాయి. శాచురేటెడ్ ఫ్యాట్లు, సోడియం, పొటాషియం, ఫైబర్, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ డి, బి 12 వంటి పోషకాలు గుడ్లలో ఉంటాయి. రోజూ కోడిగుడ్లను తింటుంటే మన శరీరానికి కావల్సిన సంపూర్ణ పోషకాహారం లభిస్తుందనడంలో అతిశయోక్తి కూడా లేదు.
అయితే మనకు మార్కెట్‌లో కొన్ని చోట్ల గోధుమ రంగు గుడ్లు కూడా కనిపిస్తాయి. అవును, మీరు కొన్ని చోట్ల వాటిని చూసి ఉంటారు కదా. నాటుకోళ్లు అయితే అవి పెట్టే గుడ్లు అలా ఉంటాయి. అయితే మరి సాధారణంగా మనం తినే కోడిగుడ్లు మాత్రం తెలుపు రంగులో ఉంటాయి. మరి కోడిగుడ్లలో ఈ తేడాలెందుకు..? ఎలాంటి రంగు ఉన్న కోడిగుడ్లను తింటే ఏమేం లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.
1.గోధుమ రంగులో ఉండే గుడ్లు సాధారణ గుడ్ల కన్నా కొంచెం ధర ఎక్కువగానే ఉంటాయి.
2. కోడిగుడ్లు సాధారణంగా తెలుపు రంగులోనే ఉంటాయి. అయితే వాటికి పెట్టే తిండి కారణంగా గుడ్ల రంగు మారుతుంది. ఎక్కువగా మొక్కజొన్న సంబంధిత ఆహారం పెడితే కోళ్లు పెట్టే గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. అందుకే ఆ గుడ్లలో ఉండే పచ్చసొన కూడా బాగా చిక్కగా ఉంటుంది.రుచి విషయానికి వస్తే తెలుపు కన్నా గోధుమ రంగు గుడ్లే ఎక్కువ రుచిగా ఉంటాయి.
3. ఇక పోషకాల విషయానికి వస్తే గోధుమ రంగు గుడ్లలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. సాధారణ గుడ్లలో కన్నా కొన్ని రెట్లు ఎక్కువ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గోధుమ రంగు గుడ్లలో ఉంటాయి. కనుక తెలుపు రంగు గుడ్ల కన్నా గోధుమ రంగు గుడ్లే బెటర్.
ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టే నాటు కోళ్లు పెట్టిన గుడ్లను చాలా మంది తింటారు. అయితే నాటు కోళ్లు మాత్రమే కాదు, ఇతర కోళ్లు కూడా గోధుమ రంగు గుడ్లు పెడతాయి. కానీ వాటికి పైన చెప్పిన విధంగా ఆహారం పెడితేనే అది సాధ్యమవుతుంది.
అలా పెట్టి గోధుమ రంగు గుడ్లను ఉత్పత్తి చేసి సూపర్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు కూడా.కనుక ఈ సారి మార్కెట్‌కు వెళితే ఓ సారి గోధుమ రంగు గుడ్లను ట్రై చేయండి. వాటి టేస్ట్ చూశాక అప్పుడు మీరే డిసైడ్ అవ్వండి. ఏ రంగు గుడ్లను తినాలో..!
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ