Betel Leaf: ఈ ఆకులు మీ ముఖంపై ఎలాంటి మచ్చలనైనా సరే.. మటుమాయం చేస్తాయి..
Betel leaves : తమలపాకులను పూజకు, ఆహారానికి ఉపయోగిస్తారు. అయితే ముఖానికి కూడా ఉపయోగిస్తారని మీకు తెలుసా? తమలపాకు అనేక చిన్న చర్మ సమస్యలకు మంచి ఔషధం.
తమలపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక చిన్న ఆకును ప్రతి రోజు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఎన్నో చర్మ సమస్యలను తగ్గించటానికి కూడా సహాయపడుతుంది. తమలపాకు రసంను నీటిలో వేసి స్నానం చేస్తే చర్మం మీద ఉన్న దురదలు తగ్గుతాయి. దురదలు వచ్చాయంటే ఒక్క పట్టానా తగ్గవు.
కొంతమందికి వేసవిలో అధిక చెమట కారణంగా శరీరం దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి వారు కూడా తమలపాకు రసాన్ని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే దుర్వాసన అంతా తొలగిపోయి తాజాగా ఉండటమే కాకుండా చాలా ప్రశాంతత కలుగుతుంది. తమలపాకులో యాంటీ బ్యాక్టీరియాల్,యాంటీ ఇన్ ఫ్లెమేటరీ లక్షణాలు ఉండుట వలన చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
తమలపాకు రసాన్ని మొటిమలు,నల్లని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే క్రమంగా తగ్గుతాయి. తమలపాకు నాచురల్ మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. ఓరల్ హైజీన్‌ని కాపాడుతుంది. చిగుళ్ళని బలోపేతం చేసి దంతక్షయాన్ని నివారిస్తుంది.
తమలపాకు రసాన్ని నీటిలో కలిపి నోటిలో పోసుకొని పుక్కిలించి ఊసేయాలి. ఇలా రోజులో రెండు సార్లు చేస్తే దంతాలకు సంబందించిన సమస్యలు తగ్గుతాయి. తమలపాకు రసాన్ని జుట్టుకి పట్టించి అరగంట తర్వాత రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ