Hair Care Tips:ఈ ఆకుల్ని ఇలా జుట్టుకి రాస్తే పొడుగ్గా పెరుగుతుందట..
Hair Care Tips:ఈ ఆకుల్ని ఇలా జుట్టుకి రాస్తే పొడుగ్గా పెరుగుతుందట.. ఈ రోజుల్లో కాలుష్యం మానవుల జీవనశైలిపై చాలా ప్రభావం చూపుతోంది. ఇది హెయిర్ గ్రోత్‌పై కూడా ఎఫెక్ట్ చూపుతోంది. ప్రస్తుతం చాలామంది జుట్టు రాలడం, చుండ్రు, దురద, కుదుళ్లు బలంగా లేకపోవడం, వెంట్రుకల చివర్లు చిట్లడం.. వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.
జుట్టుకి సంబంధించిన సమస్యలు చుండ్రు, జుట్టు రాలడం, జుట్టు చిట్లడం వంటి సమస్యలను తగ్గించుకోవటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. ఈ సమస్యలకు ఖరీదైన నూనెలను వాడాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చులో కేవలం మూడు ఆకులను ఉపయోగించి ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఈ చిట్కా కోసం 10 మందార ఆకులు, పది జామాకులు, గుప్పెడు మునగాకులు తీసుకుని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసి నీటిని పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. నీటికి బదులు బియ్యం కడిగిన నీరు కూడా పోయవచ్చు. ఈ పేస్ట్ ను ఒక పలుచని గుడ్డలో వేసి వడకట్టి ఆ నీటిని తల కుదుళ్లకు బాగా రాయాలి.
అరగంటయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది.
జామ ఆకులలో ఉండే విటమిన్ బి, విటమిన్ సి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు డ్యామేజ్ నివారిస్తుంది. . మందార ఆకులో ఉండే ఆమినో యాసిడ్స్ చుండ్రును తగ్గించడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా సహాయపడుతుంది.
అలాగే జుట్టుకు కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. మునగాకులలోఉండే విటమిన్ ఏ, విటమిన్ సి జుట్టుకు పోషణ ఇవ్వటమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. శరీరంలో కణాలు మరియు కణజాలల అభివృద్దిలో విటమిన్ ఏ కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ఈ చిట్కా ఫాలో అయ్యి జుట్టు సమస్యల నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ