Kitchenvantalu

Dal Khichdi Recipe | దాల్ ఖిచ్డీ.. ఫాస్ట్‌గా చేసుకునే ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కంటే చాలా బెస్ట్!

Dal Khichdi Recipe | దాల్ ఖిచ్డీ.. ఫాస్ట్‌గా చేసుకునే ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కంటే చాలా బెస్ట్.. అన్నం, కూర, పప్పు, చారు, నెయ్యి. భోజనం అంటే ఇన్ని రకాలు చేసుకోవాలి. కాని ఇవేవి చేయకుండానే అన్ని తిన్న ఫీలింగ్ వస్తుందంటే అది కేవలం కిచిడితోనే.. చిటికెలో అయిపోయే దాల్ కిచిడి తయారు చేద్దాం.

కావాల్సిన పధార్ధాలు
బియ్యం – 1కప్పు
పచ్చిమిర్చి- 3
ఎర్రపప్పు- 3/4 కప్పు
బంగాళదుంప-1
ఉల్లిపాయ-1
తాజా బఠానీలు-1/2 కప్పు
అల్లంవెల్లుల్లి పేస్ట్-1 టేబుల్ స్పూన్
పసుపు-1/2 టీ స్పూన్
ఉప్పు-రుచికి సరిపడా
నీళ్లు -8 కప్పులు
నూనె-3 టేబుల్ స్పూన్స్
మసాల కోసం
నెయ్యి-4 టేబుల్ స్పూన్స్
ఇంగువ – 2 చిటికెల్లు
ఎండు మిర్చి-3
జీలకర్ర-1 టేబుల్ స్పూన్
టమోట-2
కారం-1/2టీ స్పూన్
కొత్తిమీర -1 కట్ట

తయారి విధానం
1.కుక్కర్ లో కొంచెం నూనె వేసి తరిగిన ఉల్లిపాయల ముక్కలను వేసి మంచి రంగు వచ్చేదాక వేయించుకోవాలి.
2.వేగిన ఉల్లిపాయల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పచ్చిమిర్చి మక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
3.ఇప్పుడు అవి వేగాక బంగాళదుంప ముక్కలను, నానబెట్టిన శెనగపప్పు, ఎర్ర శెనగలు , బియ్యం, పసుపు, ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ పై తడి పోయే వరకు వేయించుకోవాలి.

4. ఇప్పుడు అందులోకి పచ్చిబఠానీలు, ఆరు కప్పుల నీళ్లు వేసి మీడియం ఫ్లేమ్ పై ఉడికించుకోవాలి.
5. బాగా ఉడికిన తర్వాత మరో రెండు కప్పుల నీళ్లు పోసి మరి కాసేపు ఆవిరి మీద ఉడికించాలి.
6.మసాల కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని కొంచెం నెయ్యి తీసుకోవాలి.
7.నెయ్యిలోకి ఎండు మిర్చి,ఇంగులవ,జీలకర్ర,టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించుకోవాలి.
8.అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోని మసాలకు కారం కలిపి కిచిడిలోకి వేసుకోవాలి.
9.చివరగా కొత్తిమీద వేడి వేడి గా సర్వ్ చేసుకుంటే కిచిడి రైస్ అదిరిపోతుంది.
Click Here To Follow Chaipakodi On Google News