Healthhealth tips in telugu

Cough And Cold:జలుబు, దగ్గు నుంచి బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి

Cough And Cold:జలుబు, దగ్గు నుంచి బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి.. చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలు మామూలే. పిల్లల నుంచి వృద్ధుల దాకా వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతుంటారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉండాలి. అలా బలంగా ఉంటేనే ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. ముఖ్యంగా ఈ చలికాలంలో విపరీతమైన మంచు కారణంగా దగ్గు,జలుబు,గొంతునొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ వంటివి చాలా తొందరగా వచ్చేస్తున్నాయి. ఇవి ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటి చిట్కా సరిపోతుంది.
cardamom in telugu
ఈ చిట్కా కోసం ఒక పొడిని తయారుచేసుకోవాలి. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టి పావు కప్పు బాదం పప్పు, పావుకప్పు పిస్తా పప్పు, పావుకప్పు జీడిపప్పు వేసి మంచి వాసన వచ్చేవరకు వెగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ పాన్ లో 2 స్పూన్స్ మిరియాలు, 1 స్పూన్ లవంగాలు, 8 యాలకులు వేసి వేగించాలి.

వేగించిన అన్నింటిని మిక్సీలో వేయాలి. ఆ తర్వాత అరస్పూన్ పసుపు వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ పొడి ఫ్రిజ్ లోనైనా పెట్టుకోవచ్చు. లేదా బయట ఉంచిన బానే ఉంటుంది. ఒక గ్లాస్ పాలను పొయ్యి మీద పెట్టి కొంచెం వేడి అయ్యాక ఒక స్పూన్ పొడి వేసి బాగా మరిగించాలి.

ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగాక గ్లాస్ లో పోసి తాగాలి. ఈ విధంగా తాగితే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ అన్ని తగ్గిపోతాయి. ఈ పాలను అన్ని వయస్సులవారు తాగవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ