Beauty Tips

Guava Leaves For Hair : జామ ఆకులతో ఇలా చేస్తే.. జుట్టు పెరుగుతుంది

Guava Leaves For Hair : జామ ఆకులతో ఇలా చేస్తే.. జుట్టు పెరుగుతుంది.. జామకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే జామ ఆకులు కూడా చాలా మేలు చేస్తాయి. జుట్టు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతాయి.

జామ ఆకుల్లో అనేక రకాల పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి. జుట్టు సమస్యల(Hair Problems) నుంచి కూడా బయటపడేందుకు జామ ఆకులు ఉపయోగపడతాయి.

ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనపడుతుంది. జుట్టు రాలటానికి తలలో ఉండే చర్మంలో ముఖ్యంగా ఆ లోపలి పొరలో ఉండే కొలాజెన్ దెబ్బతినటం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. కొలాజెన్ దెబ్బతినటం వలన జుట్టు కుదుళ్లు బలహీనంగా మారి జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.

జుట్టు కుదుళ్లలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చు. ఈ సమస్యను తగ్గించటానికి జామ ఆకులు బాగా సహాయ పడతాయి. జామ ఆకులో ఉండే విటమిన్ సి, కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఈ రెండిటి కలయిక వల్ల జుట్టు కుదుళ్ల లో కొలాజిన్ ప్రొడక్షన్ బాగా పెరిగి జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి.

జామాకులో ఉండే లైకోపిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎండ యొక్క యు వి కిరణాల నుండి జుట్టును రక్షించడానికి సహాయపడుతుంది. దీని కోసం జామ ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి రసం తీయాలి. ఈ రసాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

జామ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా మరిగించాలి. మరిగిన నీటిని వడకట్టి జుట్టుకి పట్టించి రెండు నిమిషాలు మసాజ్ చేసి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. పైన చెప్పిన ఏ పద్దతి ఫాలో అయిన పర్వాలేదు. జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ