Devotional

Navratri 2024: దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు పొరపాటున కూడా చేయోద్దు.. పండితులు ఏమంటున్నారంటే..?..

Dussehra Navratri 2024: దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు కొన్ని పొరపాట్లు చేయోద్దని కూడా పండితులు చెబుతున్నారు.అక్టోబరు 3 న ప్రారంభం అయ్యి 12 వరకు శరన్నావరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

ముఖ్యంగా నవరాత్రులలో దుర్గామ్మ తొమ్మిది అవతారలలో భక్తులకు దర్శనమిస్తుంటారు. నవరాత్రుల్లో తొమ్మిది రోజులు దుర్గాదేవిని తొమ్మిది అవతారాలలో అలంకరణ చేసి పూజిస్తాం. ఈ నవరాత్రుల్లో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి.

అలాగే కొన్ని పనులు తప్పనిసరిగా చేయవలసినవి ఉన్నాయి . ముందుగా చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. అలాగే ఉల్లిపాయ,వెల్లుల్లిపాయలను వాడకూడదు. ఇంటిలో నవరాత్రులను ప్రారంభించినపుడు అఖండ దీపం వెలిగిస్తే మాత్రం నవరాత్రులు అయ్యేవరకు ఇల్లు వదిలి ఎక్కడకు వెళ్ళకూడదు.

ఈ తొమ్మిది రోజులు నిమ్మకాయలు ఎట్టి పరిస్థితిలో కోయకూడదు. ఎందుకంటే నిమ్మకాయ అమ్మవారికి చాలా ఇష్టమైన పూజ ద్రవ్యం. అమ్మవారికి నిమ్మకాయలతో దండ గుచ్చి వేస్తూ ఉంటాం. అమ్మవారికి నిమ్మకాయ చాలా ప్రీతికరమైనది. నవరాత్రి తొమ్మిది రోజులు హెయిర్ కట్ చేయించుకోకూడదు.

ఇలా చేస్తే దుర్గా దేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందట. నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజులు పూజ చేసి ఉపవాసం ఉండేవారు అసలు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఇలా చేస్తే పూజ చేసిన ఫలితం ఉండదు. అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టె వంటకాలలో పంచదార వాడకూడదు. పంచదారకు బదులు బెల్లం లేదా తేనే ఉపయోగించాలి.

చేయవలసిన పనులు
నవరాత్రులు తొమ్మిది రోజులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానము చేసి పూజ చేయాలి. సూర్యోదయం తర్వాత కూడా పడుకోవటం అంత మంచిది కాదు. అలాగే ఉదయం,సాయంత్రం అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి.

ఈ తొమ్మిది రోజుల్లో ఒక్క రోజు బ్రాహ్మణుడికి భోజనం పెట్టటం కానీ అమ్మవారి పేరు మీదుగా స్వయంపాకం దానం ఇవ్వాలి. అంతేకాక పేద బ్రాహ్మణులకు మీకు తోచిన విధంగా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా చేస్తే అమ్మవారి కటాక్షం కలిగి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ నియమాలను పాటిస్తే అమ్మవారి కృప కలిగి సుఖ సంతోషాలతో ఉంటాం.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ