DevotionalToday Rasi Phalalu In telugu

Today Horoscope:October 8 రాశి ఫలాలు-ఈ రాశి వారికి ఆందోళన ఎక్కువ…

Today Horoscope:October 8 రాశి ఫలాలు-ఈ రాశి వారికి ఆందోళన ఎక్కువ… జాతకాలను నమ్మవచ్చు. జాతకమే జీవితం అన్నట్టు ఉండకూడదు. ఈ మధ్య కాలంలో జాతకాలను నమ్మే వారు ఎక్కువగా కనపడుతున్నారు. జాతకాలను నమ్ముతూ ప్రతి రోజు రాశి ఫలాలను చూసుకుంటూ వాటికి అనుగుణంగా పనులను చేస్తూ ఉండేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.

మేషరాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనిని అంకితభావంతో చేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనిని చాలా జాగ్రత్తగా చేస్తారు. అనుకున్న పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఆర్ధికంగా బాగుంటుంది.

మిధున రాశి
ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువ. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి.

కర్కాటక రాశి
ప్రారంభించిన పనులు పూర్తి అవుతాయి. ఆర్థికపరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శాంతంగా వ్యవహరించాలి.

సింహరాశి
ఈ రాశి వారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలలో ఓర్పు చాలా అవసరం. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచి ఫలితాలు వస్తాయి.

కన్యా రాశి
ఈ రాశి వారు చేసే పనులను చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. అప్పుడే విజయాన్ని సాదిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

తులారాశి
ఈ రాశి వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. కీలకమైన విషయాలలో పెద్దలను కలుస్తారు. వివాదాల జోలికి అసలు వెళ్ళకూడదు. డబ్బు విషయంలో లోటు ఉండదు.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనులు విజయవంతం అవుతారు. అలాగే ధన లాభం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆశయాల సిద్ధిస్తాయి. ఈ రాశి వారికి కాలం బాగా కలిసొస్తుంది.

ధనుస్సు రాశి
ఈ రాశి వారు ఎక్కువగా కష్టపడాలి. కీలకమైన విషయాలలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి
ఈ రాశి వారు వారి రంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి.

కుంభరాశి
వారి రంగాల్లో విజయం సాధిస్తారు. మనోబలం కలిగి ఉంటారు. సంపూర్ణ కార్యసిద్ధి ఉంటుంది.ఆందోళన,ఒత్తిడి లేకుండా చూసుకోవాలి

మీన రాశి
ఈ రాశి వారు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగితే సమస్య లేకుండా ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం అందుతుంది.ఆందోళన లేకుండా చూసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.