Beauty Tips

Hair Fall Tips:ఈ నూనెతో మసాజ్ చేస్తే తలలో దురద,చుండ్రు తగ్గి జుట్టు పెరుగుతుందట.

Hair Fall Tips:ఈ నూనెతో మసాజ్ చేస్తే తలలో దురద,చుండ్రు తగ్గి జుట్టు పెరుగుతుందట… చుండ్రు.. ఈ సమస్యతో చాలా మంది బాధపడతారు. ఈ సమస్య వచ్చిదంటే చాలు జుట్టు బలహీనమవ్వడమే కాకుండా రాలుతుంటుంది. స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్‌కి కారణమవుతుంది. మరి చుండ్రుని దూరం చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

చుండ్రు సమస్య అనేది ఒక్కసారి వచ్చిందంటే తగ్గించుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. దీని కోసం మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్దంగా తయారుచేసుకొనే నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ నూనె తయారుచేసుకోవటం కూడా చాలా సులువు. ఒక్కసారి తయారుచేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.

పొయ్యి వెలిగించి పాన్ పెట్టి దానిలో ఒక కప్పు కొబ్బరి నూనె, 4 లవంగాలు,నాలుగు మిరియాలు,ఒక స్పూన్ మెంతులు,గుప్పెడు కరివేపాకు, నాలుగు ఎర్ర మందారపువ్వుల రేకలు వేసి బాగా మరిగించాలి. బాగా మరిగిన ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి రాత్రి అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా నాలుగు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు సమస్య క్రమంగా తొలగిపోతుంది. అలాగే తల మీద దురద కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య ఉన్నప్పుడూ జుట్టు రాలే సమస్య కూడా పెరుగుతుంది. మెంతులు,మిరియాలు,కరివేపాకు,మందార పువ్వులలో ఉన్న లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ