DevotionalToday Rasi Phalalu In telugu

Rasi Phalalu:October 9 రాశి ఫలాలు… ఈ రాశి వారికి ఆర్ధికంగా బాగుంటుంది…మీ రాశి ఉందా…?

Rasi Phalalu:October 9 రాశి ఫలాలు… ఈ రాశి వారికి ఆర్ధికంగా బాగుంటుంది…మీ రాశి ఉందా… ఈ మధ్య కాలంలో జాతకాలను నమ్మే వారు చాలా ఎక్కువ అవుతున్నారు.మనలో చాలా మంది ప్రతి రోజు రాశి ఫలాలను చూసుకొని దానికి అనుగుణంగా పనులను చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది అసలు జాతకాలను నమ్మరు. ఈ రాశి ఫలాలు జాతకాలను నమ్మే వారి కోసం.

మేష రాశి
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పడతాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి
ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి
ఈ రాశి వారు చేసే ప్రతి పనిలో చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ఒక నిర్ణయం తీసుకున్నాక వెనకడుగు వెయ్యకూడదు. సమస్యలను చూసి భయపడకూడదు.

కర్కాటక రాశి
ఈ రాశి వారికి కొన్ని సంఘటనలు కారణంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలకమైన నిర్ణయాలలో ముందుకు పడుతుంది. అందర్నీ కలుపుకొని పోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది.

సింహరాశి
ఈ రాశి వారు కీలకమైన వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. అనవసర ఖర్చులు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

కన్యారాశి
ఈ రాశి వారికి చేసే ప్రతి పనిలో సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనం వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాదాల జోలికి చాలా దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

తులారాశి
ఈ రాశి వారు శ్రమ పెరగకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళిక బద్ధంగా చేస్తే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఉన్నతమైన ఆలోచన విధానంతో అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. పని మీద శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. ఆర్థికంగా చాలా బాగుంటుంది.

ధనస్సు రాశి
ఈ రాశి వారికి చేసే ప్రతి పనిలో పనికి తగ్గట్టుగా ప్రతిఫలం అందుతుంది. అనవసర విషయాలలో జోక్యం చేసుకోకూడదు. గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా తప్పుకోవాలి.

మకర రాశి
ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఎక్కువగా వస్తాయి. కొందరి ప్రవర్తన కొంచెం మన స్థాపాన్ని కలిగిస్తుంది. గిట్టని వారు చేసే ఆరోపణలను పట్టించుకోకూడదు.

కుంభరాశి
ఈ రాశి వారు ఒత్తిడిని జయించి విజయాన్ని అందుకుంటారు. చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటినుంచి చేయాలనుకున్న పనులు పూర్తవుతాయి.

మీన రాశి
ఈ రాశి వారు గత అనుభవాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దానికి అనుగుణంగానే వీరి జీవితం ఉంటుంది. మొహమాటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.