Beauty Tips

Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి తీరిక, ఓపిక లేని వారు… ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది

Face Glow Tips:ఏదైనా చర్మ సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన వంటింటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా బయట పడవచ్చు. అయితే కాస్త ఓపికగా చేసుకోవాలి.

సాధారణంగా ఎవరైనా ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు ఏమీ లేకుండా తెల్లగా, అందంగా మెరిసిపోవాలని కోరుకుంటారు. దాని కోసం వేల కొద్ది డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ముఖం తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.

ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పులు వంటి అనేక రకాల కారణాలతో చర్మ సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పే పొడి తయారు చేసుకుని వాడితే చర్మం సహజంగానే మెరుస్తుంది. పొయ్యి వెలిగించి పాన్ పెట్టి రెండు స్పూన్ల ఎర్ర కందిపప్పు, రెండు స్పూన్ల పెసలు, రెండు స్పూన్ల ఆవాలు, రెండు స్పూన్ల శనగపప్పు వేసి వేయించుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి .

ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మ తొక్కల పొడి, ఒక స్పూను గంధం పొడి వేసి మరొకసారి మిక్సీ చేసి ఈ పౌడర్ ని ఒక బాక్స్ లో పోసి నిలువ చేసుకోవాలి . ఒక బౌల్లో రెండు స్పూన్ల పొడి వేసుకొని నీరు లేదా పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి, మెడకు రాసి 10 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మంపై మురికి,నల్లని మచ్చలు,మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News