Kitchenvantalu

Masala Macaroni Recipe: మసాలా మాకరోనీ రెసిపీ.. టేస్టీ ఇంకా ఈజీ కూడా…పిల్లలు ఇష్టంగా తింటారు

Masala Macaroni Recipe: రెగ్యూలర్ గా కాకపోయినా, అప్పుడప్పుడూ ఫుడ్ లో ఛేంజ్ కావాలనిపిస్తుంది. రెగ్యూలర్ ఫుడ్ కు కాస్త భిన్నమైన పాస్తా. స్నాక్స్ గా మసాలా మ్యాకరోనీ ఎలా తయారు చేయాలో తెల్సుకుని ఈవినింగ్స్ స్నాక్స్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి.

కావాల్సిన పదార్ధాలు
మ్యాకరోనీ – 1 కప్పు
నూనె లేదా బటర్ – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టీ స్పూన్
తరిగిన వెల్లుల్లి – 1 టీ స్పూన్
తరిగిన ఉల్లిపాయలు – 1/3కప్పు
తరిగిన పచ్చిమిర్చి – 2 టీ స్పూన్స్
ఉప్పు – తగినంత
పసుపు – చిడికెడు
కారం – ¾ స్పూన్
జీలకర్ర పొడి – 1/2టీస్పూన్
ధనియాల పొడి -1/2టీస్పూన్
గరం మసాలా – 1/4టీ స్పూన్
పెప్పర్ పౌడర్ – ¼ టీ స్పూన్
తరిగిన టమాట- 1/2కప్పు
తరిగిన క్యాప్సికమ్ – 1/4కప్పు
గ్రీన్ పీస్ – 1/4కప్పు
కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్
నిమ్మరసం -1 స్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని, తగినన్ని నీళ్లు పోసి, మ్యాకరోనీ వేసుకుని, 90 శాతం వరకు ఉడికించి, చల్లార్చుకోండి.
2.స్టవ్ పై వేరోక పాన్ పెట్టుకుని, ఆయిల్ వేసుకోవాలి.
3.అందులోకి జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు, వేసుకుని, మెత్త పడే వరకు వేయించుకోవాలి.

4.ఉల్లిపాయలు వేగిన తర్వాత , తరిగిన టమాటాలు పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మాసాల, తగినంత ఉప్పు వేసుకుని, టమాట మెత్తగా ఉడికించాలి.
5.సగానికి ఉడికిన తర్వాత క్యాప్సికమ్ వేసి, ఒక నిముషం వేయించుకుని, ఆపై నీళ్లు పోసి, హై ఫ్లేమ్ పై ఉడికించాలి.
6.అందులోకి, మ్యాకరోనీ, పచ్చిబటానీలు వేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి.
7.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర జల్లుకుని సెర్వ్ చేసుకోవాలి. అంతే .. మసాలా మ్యాకరోనీ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News