Chiranjeevi Khaidi:ఖైదీ సినిమాకి చిరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా..?
Chiranjeevi Khaidi movie:చిరంజీవి సినిమా ఎప్పడు వస్తుందా అని ఎదురు చూసే అభిమానులు చాలా మంది ఉన్నారు. చిరంజీవికి స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఖైదీ. ఈ మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు. అప్పటి వరకూ నటించిన సినిమాలు ఒక ఎత్తు, ఈ మూవీ మరో ఎత్తు అయింది.
ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో సంయుక్త మూవీ పతాకంపై నిర్మించిన ఈ మూవీ 1983అక్టోబర్ 28న రిలీజై బ్లాక్ బస్టర్ అయింది.పరుచూరి బ్రదర్స్ కథ మాటలు అందించగా, మాధవి, సుమలత హీరోయిన్స్ గా నటించారు.
రగులుతోంది మొగలి పొద సాంగ్ చిరంజీవి,మాధవిలపై చిత్రీకరించగా, డాన్స్ మాస్టర్లు సలీం, శివశంకర్ లు కంపోజ్ చేసారు. ఇక చక్రవర్తి మ్యూజిక్ అదరగొట్టేసింది.
20సెంటర్స్ లో 100రోజులు, 6సెంటర్స్ లో 200రోజులు ఆడింది.
20నుంచి 25లక్షలు మాత్రమే వెచ్చించి తీసిన ఈ మూవీ మూడు కోట్ల వరకూ వసూళ్లు రాబట్టిందని అంచనా.ఈ సినిమాకి చిరంజీవి remuneration గా దాదాపుగా 1,75,౦౦౦ రూపాయిలను తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే పూర్తీ చేసారు.