Tollywood:ఈ బాలనటులను గుర్తు పట్టారా…ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నారో..?
Bala gopaludu movie child artists :సినిమా పరిశ్రమలో కొందరు కల్సి నటించినా మనం పెద్దగా గుర్తించలేం. గమ్మున స్ఫురణకు కూడా రాదు. స్టార్ హీరోల పిల్లలు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు. నటిస్తున్నారు కూడా. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, అఖిల్, తరుణ్, ఇలా చాలామంది చిన్నప్పుడు తెరమీద మెరిశారు. పెద్దయ్యాక హీరోలుగా దుమ్మురేపుతున్నారు.
అలాగే రాశి కూడా చిన్నప్పుడు సినిమాల్లో బాలనటిగా మెరిసింది. అలాగే కళ్యాణ్ రామ్ కూడా చేసాడు. ఇక వీరిద్దరూ కల్సి ఒకే సినిమాలో నటించారు. అందునా అన్నాచెల్లెళ్లుగా నటించారు. నందమూరి బాలయ్య ,సుహాసిని నటించిన బాలగోపాలుడు మూవీ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చింది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్, రాశి నటించారు.
కళ్యాణ్ రామ్ పేరు రాజా. రాశి పేరు లక్ష్మి. వీరిద్దరూ అన్నాచెల్లెళ్లు. పైగా అనాధలుగా నటించారు. వీరిద్దరిని బాలయ్య చేరదీసి ఆశ్రయం కల్పిస్తాడు. ఇక కళ్యాణ్ రామ్ మళ్ళీ ఏ సినిమాలో నటించకపోయినా, రాశి మాత్రం ఆదిత్య 369, అంకుశం, రావుగారిల్లు,పల్నాటి పౌరుషం వంటి మూవీస్ లో చేసింది. తెలుగులోనే కాదు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో నటించింది.
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అలాగే రాశి కూడా ఒక పక్క సినిమాలు మరో పక్క సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది.