Bhaktha kannappa :భక్త కన్నప్ప సినిమా…ఎన్ని కోట్ల లాభమో..అసలు నమ్మలేరు..
Bhaktha kannappa Telugu Movie :ఒకప్పుడు భక్త కన్నప్ప సినిమా అంటే అదో రకమైన క్రేజ్. ఈ పాత్ర కోసమే రెబెల్ స్టార్ కృష్ణంరాజు పుట్టాడా అనిపించేలా జీవించాడు. బాపు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ సినీ చరిత్రలో ఓ రికార్డు. ప్రభాస్ తో ఈ మూవీ మళ్ళీ తీయాలని కృష్ణంరాజు కోరిక.
శ్రీకాళహస్తి అంటే చిన్నప్పటి నుంచి ఇష్టపడే కృష్ణంరాజు భక్తకన్నప్ప మూవీ ఎవరైనా తీస్తే చూడాలని అన్పించింది. పెద్దయ్యాక ఇండస్ట్రీలోకి వచ్చిన కృష్ణంరాజు చిన్న చిన్న పాత్రలతో ఎదుగుతూ గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పెట్టి, కృష్ణవేణి మూవీ తీసి సూపర్ హిట్ కొట్టారు. ఆసమయంలో భక్తకన్నప్ప మూవీ గుర్తొచ్చింది.
అయితే అప్పటికే కన్నడ రాజకుమార్ ఓ సినిమా తీసి,హిట్ కొట్టి, శ్రీకాళహస్తీశ్వర మహత్యం మూవీగా డబ్బింగ్ చేస్తే తెలుగులోనూ హిట్ అయింది.
అయినా సరే, సినిమా తీయాలని కథ రెడీ చేయించారు. గోపికృష్ణ మూవీస్ పై రెండవ సినిమాగా ప్రకటించి, వి. మధుసూదనరావు, భీం సింగ్ లను డైరెక్టర్లుగా అనుకున్నారు.
కుదరకపోవడంతో బాపు రమణ గురించి ఎవరో చెప్పడంతో స్వయంగా కృష్ణంరాజు వెళ్లి అడగడంతో వాళ్ళు ఒకే చెప్పి, కొన్ని మార్పులు చేర్పులు చేసి, కొంత కల్పన జోడించి స్క్రిప్ట్ రెడీ చేసారు. హీరోయిన్ గా వాణిశ్రీ, రావు గోపాలరావు, బాలయ్య, శ్రీధర్, ఇలా అందరిని సెలెక్ట్ చేసారు. హీరో చిన్నప్పటి క్యారెక్టర్ రోహిణి చేసింది.
ఆరుద్ర స్వయంగా ఏజన్సీ గూడెం వెళ్లి పదిరోజులు గడిపి, వారి భాషకు అనుగుణంగా పాటలు రాసారు. నాలుగు సాంగ్స్ ఆదినారాయణరావు చేసాక, అనారోగ్యం కారణంగా సత్యంని పెట్టారు. వైఎస్సార్ స్వామి ఫొటోగ్రఫీ. 1976జనవరి లో షూటింగ్ స్టార్ట్. గూటాల, పట్టిసీమ షూటింగ్ చేసాక బుట్టాయ గూడెంకి దగ్గరలో అడవిలో గూడెం సెట్ వేశారు.
90 అడుగుల అమ్మవారి విగ్రహం పెట్టారు. ఈ సెట్టింగ్ కి అప్పట్లో 10 లక్షలు అయింది. 80 మంది డాన్సర్లతో 10 రోజుల పాటు ఓ సాంగ్ షూట్ చేసారు. 600 మంది వరకూ సెట్ లో ఉండేవారు. అందరికీ భోజనాలు వసతి మామూలే. 75 రోజుల్లో షూటింగ్ పూర్తి. 1976మే 29న మూవీ రిలీజ్. నాస్తికుడైన తిన్నడు తర్వాత మహా భక్తుడైన కన్నప్పగా మారడమే ఈ సినిమా సారాంశం.
శివలింగం నుంచి రక్తం రావడం చూసి తన కన్నుని అర్పించి భక్తకన్నప్ప అయ్యాడు. ఈ సినిమా చూసాక చాలామంది శ్రీకాళహస్తి వెళ్లారు. కృష్ణంరాజు భక్తి రసాన్ని అద్భుతంగా పండించారు. ఎన్టీఆర్, అక్కినేని మాత్రమే కాదు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కూడా తనకంటే బాగా చేసావని అభినందించడం మామూలు విషయం కాదు.
కొత్తగా ఫాన్స్ ని తెచ్చుకోగలిగారు. 20 లక్షలతో తీసిన ఈమూవీ 6 కేంద్రాల్లో 100డేస్ అయింది. కోటి రూపాయల కలెక్షన్ సాధించింది. ఆడియోగ్రఫీ విభాగంలో నేషనల్ అవార్డు వచ్చింది. మళ్ళీ 42ఏళ్ల తర్వాత రంగస్థలం మూవీకి ఇలాంటి అవార్డు వచ్చింది.