White Hair Turn Black:టీనేజీలోనే తెల్ల జుట్టు సమస్యా..ఇంట్లో తయారు చేసే ఈ నూనెతో చెక్..
Best Offer:ఆఫీస్,కాలేజ్,పండగ,పార్టీ వేర్.. ఇలా అన్నింటికీ సెట్ అయ్యే…
White Hair Turn Black:తెల్ల జుట్టు సమస్య చాలా చిన్న వయస్సులో వచ్చిన అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి చిట్కాలు ఎటువంటి సైడ్ ఎఫెత్స్ లేకుండా చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య రావటంతో మనలో చాలా మంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వైపు చూస్తున్నారు. అలా కాకుండా ఇంటిలో సహజసిద్దమైన వస్తువులతో చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
“మూలికల రాజు”గా ప్రసిద్ధి చెందిన భృంగరాజ్ తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు. భృంగరాజ్ తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ రేమిడిలో భృంగరాజ్ తో పాటు కొబ్బరి నూనెను కూడా ఉపయోగిస్తున్నాం.
ఒక బౌల్ లో రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసి ఒక స్పూన్ భృంగరాజ్ పొడిని వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి 5 నిమిషాల పాటు వేడి చేసి.. ఆ తర్వాత గంట పాటు అలా వదిలేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News