Beauty Tips

Winter Hair Fall:ఈ గింజలలో ఈ రెండు కలిపి రాస్తే జుట్టు ఎంత పల్చగా ఉన్నా ఒత్తుగా మారుతుంది

Gurivinda Ginja For Hair: ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు.

జుట్టు రాలిపోవటం, తలలో దురద,చుండ్రు సమస్య ఇలా జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి గురివింద గింజ‌లు సహాయపడతాయి. ఈ గింజలు పొలాల ద‌గ్గ‌ర‌, చేల కంచెల వెంబ‌డి విరివిరిగా ల‌భిస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఉండే వారికీ ఈ గింజల గురించి తెలుసు. అయితే ఇప్పుడు ఇవి online Stores మరియు ఆయుర్వేద షాపుల్లో కూడా విరివిగా లభ్యం అవుతున్నాయి.

గురివింద గింజ‌ల‌లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. గురివింద గింజ‌ల‌ను మిక్సీ జార్ లో వేసి పప్పు వలె మిక్సీ చేసుకోవాలి. ఈ పప్పును ఒక మందపాటి వస్త్రంలో వేసి మూట కట్టాలి. త‌రువాత ఒక గిన్నెలో అర గ్లాస్ పాల‌ను తీసుకోవాలి. ఇందులో గురివింద గింజ‌ల మూట వేసి పాలు పూర్తిగా ఆవిరై పోయే వ‌ర‌కు మ‌రిగించాలి.

ఆ తర్వాత మూట‌ను తీసి ప‌క్కకు పెట్టాలి. మరొక గిన్నెలో 100 గ్రాముల కొబ్బరి నూనెను తీసుకోని ఒక స్పూన్ గుంట‌గ‌ల‌గ‌రాకు పొడిని వేసి క‌ల‌పాలి. ఆ తర్వాత ఉడికించిన గురివింద గింజ‌ల ప‌ప్పు కూడా వేసి క‌ల‌పాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించి చల్లారబెట్టాలి. ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి.

ఈ నూనెను రాత్రి పడుకొనే ముందు జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది. దుర‌ద‌, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

https://www.chaipakodi.com/