Pushpa movie:పుష్ప సినిమా లో బన్నీకి యాస నేర్పించింది ఎవరో తెలుసా…?
Allu ARjun Pushpa Movie Details : అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే అభిమానులు చూడటానికి సిద్దంగా ఉంటారు. తమ అభిమాన హీరో గురించి విషయాలు తెలుసుకోవటానికి కూడా చాలా ఆసక్తిగా ఉంటారు. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ తగ్గేదిలే అంటూదూసుకుపోయింది.
ఊర మాస్ క్యారెక్టర్ తో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడుతూ తన నట విశ్వరూపం చూపించాడు.ఇక ఈ మూవీలో చరణ్ అనే నటుడు పరిచయం అయ్యాడు. యితడు శ్రీకాళహస్తిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల యాసపై పట్టు సాధించడంతో పుష్ప మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది.
అంతేకాదు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కొన్ని మూవీస్ లో నటించే ఛాన్స్ వచ్చింది.ఇక ఈ మూవీలో నటిస్తున్న సమయంలోనే చరణ్ ఓ ఇంటివాడు కూడా అయ్యాడు.. దాంతో పుష్ప తనకి లైఫ్‌తో పాటు వైఫ్‌ని కూడా ఇచ్చిందని చరణ్ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నాడు. అసలు చరణ్ ఎవరనే సెర్చ్ కూడా మొదలైంది.
పూణేలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం వచ్చినప్పటికీ సినిమాల్లో నటించాలన్న కోరికతో హైదరాబాద్ వచ్చేసి, ఛాన్స్ ల కోసం ఫిల్మ్‌నగర్ వీధుల్లో తిరిగి, తిరిగి చివరకు సొంతూరు నాయుడు పేట మండలం పూడేరు వెళ్లి మూడు నెలలు ఆటో తోలాడు. అయితే ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాతో మళ్లీ హైదరాబాదు రావడంతో చరణ్ కి పుష్పలో ఛాన్స్ దక్కింది.
చరణ్ చిత్తూరు యాసలో మాట్లాడడం చూసి డైరెక్టర్ సుకుమార్ ముచ్చటపడి, పుష్ప చిత్రంలో నటించేందుకు ఛాన్స్ ఇచ్చాడు. పైగా ఈమూవీ చిత్తూరు యాస ప్రధానం కావడంతో నటీనటులకు యాస నేర్పించే అవకాశం కూడా చరణ్‌కి దక్కింది. ముఖ్యంగా సినిమా షూటింగ్ అంతా తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో చేసినప్పటికీ, చరణ్ తో సహా ముగ్గురు యువకులు కల్సి నటీనటులకు చిత్తూరు యాస నేర్పించారు.