Kitchenvantalu

Cabbage Papaya Salad: ఈ సలాడ్ తింటే బరువు తగ్గటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు

Cabbage Papaya Salad: అధిక బరువు సమస్య, ఈ రోజుల్లో అధికం అనే చెప్పాలి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్లు, కొంచెం టేస్టీగా బరువు తగ్గడానికి ఉపయోగ పడేలా, హెల్తీ క్యాబేజ్ బొప్పాయి సలాడ్ ఎలా చేయాలో తెల్సుకుందాం. ఇంకెందుకు ఆలస్యం బరువు తగ్గాలనుకున్న వాళ్లు ఈ రెసిపీ ఫాలో అయిపోండి.

కావాల్సిన పదార్దాలు
పచ్చి బొప్పాయి తురుము – ¾ కప్పు
క్యాబేజీ తురుము – ¾ కప్పు
పచ్చిమిర్చి – 1
పల్లీలు పొడి – 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – ¾ టీ స్పూన్
నూనె – 1 టేబుల్ స్పూన్
దానిమ్మ గింజలు – ½ కప్పు
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని, కొంచెం నూనె వేసుకుని, ఆవాలు వేసి, చిటపటలాడుతుండగా,పచ్చిమిర్చి కూడా వేసుకుంది.
2.పచ్చిమిర్చి కాస్త వేగాక, పచ్చి బొప్పాయి తురుము, క్యాబేజీ తురుము వేసుకుని, లో ఫేమ్ లో రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ హాఫ్ చేసుకుని, అందులోకి దానిమ్మ గింజలు, వేయించిన పల్లీల పొడి, నిమ్మరసం, పచ్చి కొత్తిమీర వేసి, కలుపుకోవాలి.
4. అంతే.. ఎంతో ఆరోగ్యకరమైన క్యాబేజీ బొప్పాయి సలాడ్ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News