Beauty Tips

Face Glow Tips:బ్యూటీపార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. ఈ సింపుల్‌ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేయండి

Milk and turmeric face pack:ఈ మధ్య కాలంలో ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందం మీద శ్రద్ద పెడుతున్నారు. దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా అందంగా కాంతివంతంగా మెరవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. బ్యూటీ పార్లర్ కి వెళ్ళకుండా ఇంటిలోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. Tomato సహజసిద్దమైన టోనర్ గా పనిచేస్తుంది. టమాటాను మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా చేస్తే చర్మంపై పెద్దగా కనిపించే రంధ్రాలు మూసుకుపోతాయి. మొటిమలు, నల్లని మచ్చలు తొలగిపోతాయి. టమాటా పేస్ట్ లో పుదీనా రసం కలిపి రాస్తే ఇంకా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. చర్మానికి సంబంధించిన పలు రకాల సమస్యలను నయం చేస్తుంది.

ఒక టేబుల్‌స్పూన్‌ పసుపులో సరిపడా పాలు పోసి పేస్ట్‌లా చేయాలి. ముఖం, మెడ భాగాలకు ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. మచ్చలు కూడా మటుమాయం అవుతాయి.

పొడిబారిన చర్మానికి ఒక టీస్పూన్‌ పసుపు, రెండు టీస్పూన్ల గంధం పొడి, సరిపడా నీళ్లు (రోజ్‌ వాటర్‌ అయినా వాడొచ్చు) కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా ఆరనివ్వాలి. వారానికి రెండుసార్లు ఈ మాస్క్‌ వేసుకుంటే బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

https://www.chaipakodi.com/