Healthhealth tips in telugu

Sweet Potato: చలి కాలంలో చిలకడ దుంప దివ్యౌషధం.. తింటే ఏం జరుగుంతో తెలిస్తే ఆశ్చర్యమే..

Sweet Potato Health benefits in telugu:మనలో చాలా మందికి చిలకడ దుంప గురించి తెలుసు. కొంతమంది ఉడికించుకొని తింటే కొంతమంది కాల్చి తింటారు. అలాగే కూరగా చేసుకొని కూడా తింటూ ఉంటారు. అంతేకాకుండా పులుసులో కూడా వేస్తారు.

చిలకడ దుంపలో పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది తినటానికి ఇష్టపడరు. ఇది చదివితే తప్పనిసరిగా చిలకడ దుంప తింటారు.

చిలకడ దుంపలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ A, C, మాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, పాంటోథెనిక్ యాసిడ్, కాపర్ (రాగి), నియాసిన్ వీటిలో ఉంటాయి. ఇవి మన శరీరంలో మలినాలను పోగొడతాయి.

చిలగడ దుంపలు మన శరీరానికి అవసరమైన మినరల్, ఐరన్ పుష్క‌లంగా ఉంటాయి.ఇవి తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో స‌హాయ‌ప‌డ‌తాయి.త‌ద్వారా క‌రోనా వంటి అనేక వైర‌స్‌ల‌తో పోరాడే రోగనిరోధక శ‌క్తి పెరుగుతుంది.అంతేకాకుండా చిలకడ దుంపలో ఉండే విట‌మిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.

ఇక సూర్య‌ర‌శ్మి నుంచి వ‌చ్చే విట‌మిన్ డి.చిల‌గ‌డ దుంప ద్వారా కూడా పొందొచ్చు.ఇందులో విట‌మిన్ డి పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల‌.అనేక జ‌బ్బుల నుంచి ర‌క్షించ‌డంతో పాటు బలమైన ఎముకలను కూడా ప్రోత్సహిస్తుంది.మ‌రియు క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించే యాంటీ ఆక్సిడెంట్లు కూడా చిలగడ దుంపల్లో ఉంటాయి.

కాబట్టి చిలకడ దుంపను వారంలో మూడు సార్లు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్పుతున్నారు. ఈ విధంగా మనకు లభ్యం అయ్యే ఆహారాలతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.