Kitchenvantalu

White sauce Maggi noodles:కొత్తగా ఇంకాస్త రుచిగా మాగి నూడుల్స్.. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు

White sauce Maggi noodles: ఎన్ని స్వదేశీ వంటకాలు ఇష్టపడ్డా, వారంలో ఒకటి రెండు సార్లు అయినా, చైనీస్, ఇటాలియన్ వెరైటీస్ వెళ్తుంటారు. ఇక నూడుల్స్ అయితే, అదో బలహీనతగా మారిపోయింది. నూడుల్స్ కోసం రోడ్ సైడ్ సెంటర్స్ ను వెతుక్కునే పనిలేకుండా, ఇంట్లోనే ఇన్ స్టెంట్ గా చేసే ఇటాలియన్ నూడుల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
నూడుల్స్ వండటానికి..
ఇన్ స్టెంట్ నూడుల్స్ – 2 ప్యాకెట్లు
నూడుల్స్ మేకర్ – 1
నీళ్లు – 1.5 కప్పు

వైట్ సాస్ కోసం..
బటర్ – 1 స్పూన్
ఆలివ్ ఆయిల్ – 1/2టీ స్పూన్
వెల్లుల్లి – 1 టీస్పూన్
రెడ్ క్యాప్సికమ్ – 7 నుంచి 8
గ్రీన్ క్యాప్సికమ్ – 7 నుంచి 8
క్యారెట్ ముక్కలు – 7 నుంచి 8
ఫ్రోజెన్ బఠానీ – 2 టీ స్పూన్
ఫ్రోజెన్ కార్న్ -2 టీ స్పూన్
మైదా – 1 టీ స్పూన్
పాలు – 3/4కప్పు
ఉప్పు – కొద్దిగా
పిజ్జా సీసనిని – 1/2టీ స్పూన్
మిర్యాల పొడి – 1/4టీ స్పూన్
చిల్లీ ఫ్లేక్స్ – 1/2టీ స్పూన్
ఫ్రెష్ క్రీమ్ – 1 టేబుల్ స్పూన్

తయరీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టుకుని , నీళ్లు వేసుకుని, మరుగుతున్న నీళ్లలో, నూడుల్స్, దానితో పాటు వచ్చే టేస్ట్ మేకర్ వేసి,ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు సాస్ కోసం స్టవ్ పై పాన్ పెట్టి, ప్యాన్ లో బటర్ నూనె వెనుకుని, బటర్ కరిగాక, వెల్లుల్లి, వేసి వేపుకోవాలి.
3. వెల్లుల్లి వేగిన తర్వాత కూరగాయలు ముక్కలు బఠానీలు అందులో వేసుకుని, మూడు నుంచి నాలుగు నిముషాలు వేపుకోవాలి.
4. వేగిన కూరగాయల ముక్కల్లో మైదా వేసి, వేపుకుని, నురగ వస్తుండగా, పాలు పోసుకుని, ఒక పొంగు రానివ్వాలి.

5. పాలు పొంగు వచ్చిన తర్వాత స్పైసెస్ అన్ని వేసి, కాస్త చిక్క పడే వరకు కలపాలి.
6. ఇప్పుడు అందులోకి, ఉడకపెట్టుకున్న వేడి నూడుల్స్ సాస్ లో , వేసి కలుపుకుని ఒక నిముషం ఉడికించాలి.
7. పాన్ దించే ముందు ఫ్రెష్ క్రీమ్ కాస్త్ ఛీజ్ తురుము వేసుకుని సెర్వ్ చేసుకోడమే.
Click Here To Follow Chaipakodi On Google News