Kitchenvantalu

Gudannam:మదురై మీనాక్షి ఆలయ ప్రసాదం గుడాన్నం.. చాలా సులభంగా చేసేయండి

Madurai Meenakshi Temple Prasadam Gudannam ఒక్కో ఆలాయనికి ఓ ప్రత్యేకత ఉంటుంది.అలాగే ఒక్కో ఆలయ ప్రసాదానికి కూడ ప్రత్యేకత ఉంటుంది.అలాగే మధురై మీనా అమ్మవారికి చేసి పెట్టే గూడాన్న ప్రసాధం ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

కావాల్సిన పదార్ధాలు
నానబెట్టిన బియ్యం – ½ కప్పు
బెల్లం – 2 కప్పులు
నెయ్యి – ½ కప్పు
యాలకులు – 3-4
పచ్చకర్పూరం – 2 చిటెకెలు
జీడిపప్పు – పిడికెడు
నీళ్లు – ¼ కప్పు

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని బియ్యంలో 1.5 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టుకోని మీడియం ఫ్లేమ్ పై మూడు విజిల్స్ రానివ్వాలి.
2.దంచుకున్న బెల్లం లో మిగిలిన నీళ్లు పోసి బెల్లం కరిగించి వడకట్టుకుని పెట్టుకోవాలి.
3.ఉడికకించిన అన్నంలో బెల్లం పాకం కొద్దిగా నెయ్యి వేసి పాకాన్నం అన్నం పీల్చుకునే వరకు కలుపుతు ఉడకనివ్వాలి.

4.మద్యమద్య లో నెయ్యి వేస్తు ఉండాలి.
5.సుమారు 20 నిమిషాలకు అన్నం దగ్గర పడుతుంది.అప్పుడు పచ్చకర్పూరం,యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
6.మిగిలిన నెయ్యిలో జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోని గూడాన్నంలో కలుపుకోవాలి.కమ్మని నైవేద్యం తయారైనట్టే.
Click Here To Follow Chaipakodi On Google News