Warts Removing : పులిపిర్లు పోవాలా.. ఇలా చేయండి..
Pulipiri in Telugu : పులిపిర్లు అనేవి వయస్సుతో సంబందం లేకుండా వస్తాయి. పులిపిర్లు వాటి ఆకారంలో విభిన్నంగా ఉంటాయి,అంటే అనేక రకాల ఆకారాల్లో శరీరంపై ఏర్పడి,చూడటానికి అందవిహీనంగా కనపడతాయి.
పులిపిర్లు రాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే కొన్ని క్రీమ్ లు వాడుతూ ఉంటారు. అలా వాడకుండా ఇంటి చిట్కాలను ట్రై చేయవచ్చు.పులిపిర్లు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో కూడా వస్తాయి.
పులిపిర్లు ఉన్నవారు వాటిని గిల్లటం,కాల్చటం మరియు కత్తరించటం వంటి పనులు అసలు చేయకూడదు. పులిపిర్లు మన శరీరంలో ఏ బాగంలోనైనా రావచ్చు. పులిపిర్లు తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడే ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.
ఆముదం తీసుకొని పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో ఒక స్పూన్ బేకింగ్ పొడి వేసి నీటిని పోసి పేస్ట్ గా కలపాలి. ఈ పేస్ట్ ని పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి ప్లాస్టర్ వేయాలి. గంట అయ్యాక తీసి శుభ్రం చేయాలి. ఈ విధంగా రాత్రి సమయంలో కూడా చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా ముందుగా ఆముదం రాసి ఆ తర్వాత బేకింగ్ సోడా పేస్ట్ రాయటం వలన పులిపిర్లు తొందరగా రాలిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/