Bengali Stuffed Poori:బెంగాల్ స్టైల్ లో పూరీలను ఇలా చేయండి.. టేస్ట్ చూస్తే వదలరు..!
Bengali Stuffed Poori: చూడటానికి పూరిలా కనిపించినా, టేస్ట్ లో డిఫరెంట్గా ఉంటుంది. పొంగిన పూరి మధ్యలో కమ్మని స్టఫ్పింగ్ కు, టేస్టీ టేస్టీ బెంగాలీ స్ట్రీట్ ఫుడ్. రాధాభలభిపూరిని(Bengali Stuffed Poori) ఒకసారి ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు
మైదా – 250 గ్రాములు
నూనె – 2 టీ స్పూన్స్
ఉప్పు – తగినంత
నూనె – ఫ్రైకి సరిపడా
స్టఫ్పింగ్ కోసం…
మినపప్పు – 1/2కప్పు
నూనె – 2 టీ స్పూన్స్
ఉల్లి గింజలు – ½ టీ స్పూన్
సోంపు – 1 టీ స్పూన్
అల్లం – 1 ఇంచ్
పచ్చమిర్చి -7
ఉప్పు – తగినంత
పసుపు – 1/4టీ స్పూన్
ఇంగువ – 2 చిటికెలు
జీలకర్ర పొడి – ½ టీస్పూన్
తయారీ విధానం
1.ఇప్పుడొక మిక్సింగ్ బౌల్ లోకి మైదా తీసుకుని, కొద్దిగా నూనె, ఉప్పు , నీళ్లు వేసి, ముద్దలా కలుపుకుని, 10 నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు నానపెట్టన మినపప్పును కొద్దిగా నీళ్లు కలిపి, చిక్కగా, మెత్తని పేస్ట్ గా రుబ్బుకోవాలి.
3. ఒక మిక్సీ జార్ లో అల్లం, పచ్చిమిర్చి వేసి, పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేసి అందులోకి ఉల్లిగింజలు, సోంపు వేసి, వేగాక అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి, ఫ్రై చేసుకోవాలి.
5. అందులోకి ఇంగువ , పసుపు, కారం, జీలకర్రపొడి, ఉప్పు వేసి రుబ్బుకున్న మినప్పిండిని ,గట్టి ముద్దలా ఏర్పడే వరకు కలుపుతూ ఉండాలి.
6. మినప పిండి ముద్దగా తయారైయ్యాక చల్లారనివ్వాలి.
7.కలిపి పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, అరచేతిపై కొద్ది వేడల్పుగా వత్తుకుని, దాని లోపల మినప పిండిని పెట్టి, మైదా పిండితో క్లోజ్ చేయాలి.
8.ఇప్పుడు స్టఫ్పింగ్ బయటికి రాకుండా, చపాతి పీటపై , మెళ్లిగా, పూరిలా కాల్చుకోవాలి.
9. ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, వెడెక్కిన నూనె లోకి తయారు చేసుకున్న పూరీలను వేసి కాల్చుకోవాలి.
10. అంతే పొంగే రాధాభల్లభిపూరి(Bengali Stuffed Poori) తయారైనట్లే.
Click Here To Follow Chaipakodi On Google News