Fridge storage tips:ఫ్రిజ్ ని వాడుతున్నారా… ఫ్రిజ్ లో కూరలు పెడుతున్నారా… 99 % మందికి తెలియని ఈ నిజాన్ని తెలుసుకోండి
Kitchen Tips in telugu :సాధారణంగా చాలా మంది ఫ్రిడ్జ్ లో ఏ వస్తువు పెట్టిన ఫ్రెష్ గా ఉంటుందని భావిస్తారు. అలానే అన్ని రకాల వస్తువులను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా కూరగాయలను,పండ్లను పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టె కూరల గురించి కొన్ని నిజాలను తెలుసుకుందాం. ఈ విషయాలను తెలుసుకుంటే ఫ్రిజ్ లో కూరగాయలు పెట్టె విషయంలో కాస్త ఆలోచిస్తారు.
టమోటా విషయానికి వస్తే ఫ్రిడ్జ్ లో ఎక్కువ రోజులు పెట్టటం వలన టమోటో రుచి తగ్గుతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు రిప్రెజింగ్ ప్రాసెస్ జరగటం వలన టమోటా వాల్స్ లో ఉండే కణాలు విచ్ఛిన్నం జరగటం వలన టమోటా రుచి కోల్పోతుంది. టమోటాలను పేపర్ బ్యాగ్ లో పెట్టి నిల్వ చేస్తే రుచి కోల్పోకుండా ఉంటుంది.
బంగాళాదుంప,ఉల్లిపాయలను ఫ్రిడ్జ్ లో ఎట్టిపరిస్థితిలోను పెట్టకూడదు. ఎందుకంటే బంగాళాదుంప మరియు ఉల్లిపాయతో ఉండే పిండిపదార్ధం ఫ్రిడ్జ్ లో పెట్టటం వలన షుగర్ గా మారుతుంది. దాంతో వాటి రుచి మారిపోతుంది. అందువల్ల బంగాళదుంపలను పేపర్ బ్యాగ్ లో పెట్టి నిల్వ చేయవచ్చు.
పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు పుచ్చకాయలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని ఒక పరిశోధనలో తేలింది. పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెడితే యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గుతాయట. ఇది కట్ చేయని పుచ్చకాయను మాత్రమే వర్తిస్తుంది.
మనం సాధారణంగా కాఫీ పొడిని ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం. ఆలా పెట్టటం వలన కాఫీలో ఉండే హైగ్రో స్కోపిక్ నేచర్ తేమను ఏక్కువగా పీల్చుకుంటుంది. దాంతో కాఫీ ఫ్లేవర్ మారిపోతుంది. అందువల్ల కాఫీ పొడిని ఫ్రిడ్జ్ లో కాకుండా గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసి డార్క్ ప్లేస్ లో పెట్టాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.