Kesar Badam Katli:బాదంతో ఇలా ఈ స్వీట్‌ను చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..నోట్లో వెన్నలా కరిగిపోతుంది..!
Kesar Badam Katli: ఫెస్టివల్స్, ఫంక్షన్స్, బర్త్ డే స్, ఏ స్పెషల్ డే అయినా , ఫ్రూట్స్ తోని, రోజును మొదలు పెడతాం. ఇక స్వీట్స్ అనగానే, షాప్స్ వరకు పరుగు తీయకుండా, కేసర్ బాదమ్ కట్లీ ఇంట్లోనే ట్రై చేయండి.
కావాల్సిన పదార్ధాలు
బాదం – 1.5 కప్పు
పాలు – 1/3కప్పు
పంచదార – 200 గ్రాములు
కుంకుమపువ్వు – చిటికెడు
తయారీ విధానం
1.బాదం పప్పులో నీళ్లు పోసుకుని, ఉడికించి, తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి.
2.తొక్క తీసుకున్న బాదం పప్పులను వడకట్టి, మిక్కీలోకి వేసుకుని, కాస్త రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత, పాలుపోసి, మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
3.ఇప్పుడు అడుగువైపు మందంగా ఉన్న ఒక బాండీ స్టవ్ పై పెట్టి, బాదం పేస్ట్ ను చెక్కర వేసి, కలుపుతూ, దగ్గర పడేవరకు మిక్స్ చేయాలి.
4. బాదం పేస్ట్ , బాండీతో వదిలి ముద్దలా తయారైనప్పుడు, అందులో కుంకుమ పువ్వు నీళ్లు పోసి, మరో 5 నిముషాలు మీడియం ఫ్లేమ్ పై కలుపుకోవాలి.
5.ఇప్పుడు చేతులతో ఉండ తయారవుతుందా చూసుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
6. ఇప్పుడు ఆ మిశ్రమం చల్లారిన తర్వాత, 5 గంటల తర్వాత, అట్లకాడతో, దానిని కలుపుకుని, చపాతి పిండిలా పగుళ్లు లేకుండా వత్తుకోవాలి.
7. ఇప్పుడు బాదం పిండి ముద్దను చపాతి కర్ర తో ¼ ఇంచ్ మందంతో అంచును సర్దుకుంటా, సమానంగా వత్తుకోవాలి.
8. తర్వాత నాలుగు మూలలుగా ఉన్న, పాత్రతో దానిపై రుద్దాలి.
9. అప్పుడు పైన సిల్వర్ ఫాయిల్ వేసి, డైమండ్ షేప్స్ లో కట్ చేసుకోవాలి.
10. అంతే కేసర్ బాదం కట్లీ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News