subhalagnam movie:శుభలగ్నం సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా…అసలు నమ్మలేరు
subhalagnam movie telugu : ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం మూవీ మహిళా ఆడియన్స్ ని మళ్ళీ థియేటర్ల వైపు మళ్లించింది. వర్షాకాలాన్ని సైతం లెక్కచేయకుండా ఈ సినిమాని ఆడియన్స్ ఆదరించారు. జగపతిబాబు, ఆమని, రోజా నటించిన ఈ చిత్రం అప్పట్లో ఓ సెన్షేషన్.
జగపతి బాబు అమాయకపు నటన, భర్తను కోటి రూపాయలకు అమ్మేసి ఆతర్వాత కన్నీటి పర్యంతమైన పాత్రలో ఆమని తమ నట విశ్వరూపం ప్రదర్శించారు. లంచాలు తీసుకోకుండా ఉన్నది చాలనుకుని సరిపెట్టుకునే మధ్యతరగతి ఉద్యోగి పాత్రలో జగపతి బాబు, డబ్బు ఆశతో భర్తను అమ్మేసి, వేరే పెళ్లి చేసిన పాత్రలో ఆమని, కోటి రూపాయలకు కొనుక్కున్నప్పటికీ అన్ని విషయాల్లో భర్తకు అండగా ఉండే పాత్రలో రోజా అదరగొట్టేసారు.
తమ్మారెడ్డి భరద్వాజ దగ్గరకు మాటల రచయిత దివాకర్ బాబు వెళ్ళినపుడు భూపతిరాజా దగ్గరున్న రెండు కథల్లో ఏది బాగుందని అడిగితె,కోటి రూపాయలకు భర్తను అమ్మేయడం బాగుందని చెప్పారట. అయితే ఆ కథ కాకుండా మరో కథ నచ్చిందని దొంగ రాస్కెల్ పేరుతొ స్టార్ట్ చేసారు. ఈలోగా అశ్వినీదత్, కృష్ణారెడ్డి కాంబోలో సినిమా కోసం చర్చ సాగుతుంటే, భూపతిరాజా దగ్గరున్న కథ గురించి దివాకర్ బాబు చెప్పారట.
అందరికీ నచ్చింది. రిస్క్ అయినా సరే, చేయాలన్న నిర్ణయానికి రావడంతో దివాకర్ బాబు మూడురోజుల్లో మాటలు రాసేశారు. స్క్రిప్ట్ సిద్ధం. హీరోగా జగపతి బాబు ఒకే. హీరోయిన్ గా రాధ పాత్రకు ఆమని నే సెలక్ట్ చేసారు. ఇంకో పాత్రకు రోజా ఒకే. 1994లో అన్నపూర్ణ స్టూడియోలో శుభలగ్నం సినిమా షూటింగ్ స్టార్ట్.
కిషోర్ రాఠీ స్విచ్ఛాన్ చేయగా, కె రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. ఈవీవీ సత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. 21రోజుల్లో టాకీ, 15రోజుల్లో సాంగ్స్ పూర్తిచేశారు. చిలకా ఓ తోడు లేక సాంగ్ కోసం మూడు షాట్స్ ముంబై సముద్రపు ఒడ్డున, రాజస్థాన్ ఎడారిలో తీశారు. మంచి సెంటిమెంట్ గా స్టోరీ నడుస్తుంటే ఈ సాంగ్ పెడితే ఇబ్బందేమోననే సందేహం వచ్చినా ఎస్వీ కృష్ణారెడ్డి తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
పైగా ఈ షూటింగ్ సమయంలోనే యమలీల సంచలన విజయాన్ని నమోదుచేసింది. దాంతో యమలీలలో ఛాన్స్ మిస్సయ్యానని బాధపడుతున్న సౌందర్యను దృష్టిలో ఉంచుకుని అలీ, సౌందర్యలతో చినుకు చినుకు అందెలతో సాంగ్ పెట్టేసారు. 1994అక్టోబర్ 30న రిలీజ్. అప్పటికే అశ్వమేధం, సరిగమలు, గోవిందా గోవిందా సినిమాలు పోయి, నిరాశతో ఉన్న అశ్వినీదత్ కి ఈ సినిమా మంచి ఎనర్జీ ఇచ్చింది.
ఉత్తమ ద్వితీయ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెండి నందిని గెలిచింది. సిరివెన్నెల రాసిన చిలకా ఏ తోడు లేక సాంగ్ నంది అవార్డు తెచ్చింది. మద్రాసులో జరిగిన 150రోజుల వేడుకకు చిరంజీవి, నాగార్జున చీఫ్ గెస్ట్ లు గా వచ్చారు.