Vanilla Ice Cream Burfi : వెనీలా ఐస్ క్రీమ్ బర్ఫీ.. ఇలా చేస్తే అచ్చం స్వీట్ షాపుల్లో ఇచ్చే విధంగా వస్తుంది..!
Vanilla Ice Cream Burfi :ఐస్ క్రీమ్, బర్ఫీస్, అందరి ఫేవరేట్స్. కాని, ఈ రెండిటిని కలపి, టేస్టీ టేస్టీ ఐస్ క్రీమ్ బర్ఫీ రెడీ చేయవచ్చు. అదెలాగో చూసేయండి.
కావాల్సిన పదార్ధాలు
తీపి పాల పిండి – 200 గ్రాములు
పేరిన నెయ్యి – 200 గ్రాములు
చక్కెర -250 గ్రాములు
నీళ్లు -150
వెనీలా షుగర్ – 1 టేబుల్ స్పూన్
పిస్తా పలుకులు – 2 టేబుల్ స్పూన్
తయారీ విధానం
1. ముందుగా ఒక చిన్న ట్రే తీసుకుని, అందులోకి బటర్ పేపర్ వేసి, పిస్తా పలుకులు చల్లి పక్కనపెట్టుకోండి.
2. ఇప్పుడు పాలపండిని , నెయ్యి వేసి బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి.
3. ఇప్పుడు వేరొక పాన్ లో , చక్కెర వేసి, నీళ్లు పోసి, తీగ పాకం వచ్చే వరకు, మరిగించుకోవాలి.
4. ఇప్పుడు తీగ పాకం రాగానే, స్టవ్ ఆఫ్ చేసి కలిపి ఉంచుకున్న పాల పిండి ముద్ద, అందులో వేసుకుని,కరిగిపోయే వరకు బాగా కలపాల.
5. ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి, అందులోకి వెనీలా షుగర్ వేసి, సన్నని మంటపై, కలుపుతూ ఉడికించాలి.
6. ఒక నాలుగు నిముషాల తర్వాత, బర్ఫీని, వేళ్ల మధ్య నలిపితే ఉండలా తయారవ్వాలి.
7. ఆ టైమ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని, మిశ్రమాన్ని మూడు నిముషాల పాటు బాగా కలుపుకోవాలి.
8. 3 నిముషాల తర్వాత బర్ఫీని, పిస్తా పలుకులు చల్లి పెట్టుకున్న ట్రైలో పోసి, స్పాచులా తో చదునుగా చేసి, 6 గంటలు లేదా రాత్రి అంతా చల్లారనివ్వాలి. 6 గంటల తర్వాత, చల్లారిన బర్ఫీని వేరొక ప్లేట్ లోకి ఉల్టా, వేసుకుంటే, బర్ఫీ సులభంగా వచ్చేస్తుంది.
9. ఇప్పుడు సన్నగా పొడవుగా, కావాల్సిన షేడ్స్ లో కట్ చేసుకుని, ఫ్రిడ్జ్ లో ఉంచిచే, నెలరోజుల పాటు తాజాగా ఉంటాయి.
Click Here To Follow Chaipakodi On Google News