Kitchenvantalu

Pulla Upma : పుల్ల ఉప్మా.. ఎప్పుడైనా దీన్ని రుచి చూశారా.. ఒక్క‌సారి తినండి.. బాగుంటుంది..

Pulla Upma: తక్కువ సమయంలో ఈజీగా చేసే టిఫిన్ అంటే అది ఉప్మానే. టిఫిన్ లోకి,లంచ్ బాక్స్ లోకి కూడ ఉప్మా ఫర్ఫెక్ట్ .ఉప్మా లో కొంచెం వెరైటీగా పుల్ల ఉప్మా చేసి చూడండి. ఉప్మా కూడ రుచిలో తక్కువేం కాదు అనుకుంటారు.

కావాల్సిన పధార్ధాలు
బియ్యం రవ్వ-1 కప్పు
వేరుశెనగపప్పు-3 టేబుల్ స్పూన్స్
నూనె-3 టేబుల్ స్పూన్స్
ఆవాలు-1 టీ స్పూన్
పచ్చి శెనగపప్పు-1 టీ స్పూన్
మినపప్పు-1 టీ స్పూన్
ఎండు మిర్చి-2-3
కరివేపాకు-2 రెమ్మలు
మిరియాల పొడి-1/2 టీ స్పూన్
ఉప్పు-రుచికి సరిపడ
పసుపు-1/4 టీ స్పూన్
చింతపండు నీళ్లు-3 కప్పులు
జీలకర్ర-1 టీ స్పూన్

తయారి విధానం

1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని బియ్యం రవ్వని మంచి సువాసన వచ్చే వరకు మాడిపోకుండా వేపుకోని పక్కన పెట్టుకోవాలి.
2.అదే ప్యాన్ లో నూనె వేసి వేడిక్కాక అందులోకి వేరు శెనగపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి.
3.అవి వేగాక అందులోకి ఆవాలు,శెనగపప్పు,మినపప్పు,ఎండుమిర్చి,జీలకర్ర,మిరియాల పొడి వేసి వేపుకోవాలి.
4.వేగిన తాలింపులోకి చింతపండు నీళ్లు ,తగినంత ఉప్పు ,పసుపు కరివేపాకు రెబ్బలు వేసి హై ఫ్లెమ్ మీద బాగా మరగనివ్వాలి.

5.చింతపండు నీళ్లు బాగా మరుగుతున్న టైంలోముందుగా వేపుకున్న బియ్యపు రవ్వను ఆడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
6.తరువాత మూత పెట్టుకోని మంటను మీడియం కి మార్చుకోని రవ్వ మెత్తపడే వరకు ఉడికించుకోవాలి.
7.రవ్వ మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోని పది నిమిషాలు అలాగే వదిలేయాలి.
8.పదినిమిషాల తర్వాత చూస్తే పుల్లా ఉప్మా కాస్త గట్టి పడుతుంది..అంతే వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.
Click Here To Follow Chaipakodi On Google News