Beauty Tips

Hair Care Tips : జుట్టు ఎందుకు రాలుతుంది? తగ్గేందుకు ఏం చేయాలంటే.. చాలా సింపుల్..

Black Rice And Coffee Hair Fall Tips:జుట్టుకి సంబందించిన సమస్యలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. జుట్టు సమస్యలు ప్రారంభం కాగానే ఖరీదైన ఉత్పత్తులను వాడుతూ ఉంటారు.

అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి పలితాన్ని పొందవచ్చు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఒత్తయిన పొడవైన జుట్టును కోరుకుంటారు. దీనికోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

జుట్టు రాలే సమస్య, చిన్న వయసులోనే బట్టతల రావడం, చిన్న వయసులో తెల్ల జుట్టు రావడం వంటి సమస్యలను తొలగించడానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో గ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ నల్ల బియ్యం, రెండు స్పూన్ల లవంగాల పొడి, ఒక స్పూన్ కాఫీ పొడి, అర స్పూన్ పోక చెక్కల పొడి వేసి 7 నుంచి 8 నిమిషాలు మరిగిస్తే వాటిలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి కాస్త చల్లరానివ్వాలి.

ఈ నీరు కాస్త చల్లారాక ఒక స్పూన్ ఆముదం కలిపి స్ప్రే బాటిల్ లో పోసి తల మీద జుట్టు మొత్తం కవర్ అయ్యేలా స్ప్రే చేయాలి. అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. అలాగే బట్టతల సమస్య కూడా తగ్గుతుంది. ఈ రెమిడీ ఫాలో అయితే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే బట్టతల సమస్య,తెల్లజుట్టు సమస్య రెండు కూడా తొలగిపోతాయి. జుట్టు పెరిగి ముఖం కూడా అందంగా మారుతుంది. బట్టతల అనేది ముఖ అందం మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి తక్కువ ఖర్చులో బట్టతల సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

https://www.chaipakodi.com/