MoviesTollywood news in telugu

julayi movie:జులాయి సినిమా గురించి నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో…

julayi movie :త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ తొలిసారి కల్సి చేసిన జులాయి మూవీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఆ తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, ఆ తర్వాత సంక్రాంతికి అలవైకుంఠపురంలో కూడా బ్లాక్ బస్టర్ కావడంతో హ్యాట్రిక్ కాంబినేషన్ అయింది. అయితే జులాయి సినిమాకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన ఖలేజా మూవీ అనుకున్న రేంజ్ లో హిట్ కాకపోవడంతో వెంకటేష్ తో సినిమా తీస్తేనే మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని త్రివిక్రమ్ భావించాడు.

ఆ దిశగా సాగిన ప్రయత్నాలు ఫలించ లేదు. దాంతో కసిగా రాసిన ఓ కథను బన్నీకి వినిపించాడు. ఈ ఛాన్స్ వదులుకోకూడదని భావించిన బన్నీ వెంటనే దేశముదురు నిర్మాత డివివి దానయ్యను లైన్ లో పెట్టాడు. హారిక హాసిని మేకర్స్ రాధాకృష్ణ కూడా భాగం పంచుకున్నాడు. అయితే 2011 మేలోనే షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకుంటే, బన్నీ భుజానికి తగిలిన గాయానికి ఆపరేషన్ అయ్యాక మొదలు పెట్టాలని నిర్ణయించారు.

దాంతో బన్నీ ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడ ఆపరేషన్ అవుతుంటే, ఇక్కడ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసారు. ఇద్దరు పోలీసు ఆఫీసర్ పాత్రలకు రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ లను తీసుకున్నారు. విలన్ గా సుదీప్ ని అనుకుని, చివరకు సోనూసూద్ ని తీసుకున్నారు. హీరోయిన్ గా ఇలియానాను ఫిక్స్.

మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ఒకే. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం ఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్య తదితర తారాగణం. నవంబర్ 2న ముహూర్తపు షాట్ తీసి, 14నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసారు. యాక్షన్స్ సీన్స్ రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ లలో తీశారు. క్లైమాక్స్ సీన్స్ విశాఖ, చెన్నైలలో తీశారు.

సినిమాకు హానీ అనే టైటిల్ అనుకున్నా, చివరకు జులాయి ఫిక్స్. 36కోట్ల బడ్జెట్ తేలింది. అయితే ఉమ్మడి ఏపీలో హక్కులను 23 కోట్లకు దాసరి నారాయణరావు సారధ్యంలోని సిరి మీడియా దక్కించుకుంది. సాటిలైట్ హక్కులు 6కోట్లు, ఆడియో రైట్స్ 70లక్షలకు ఆదిత్య మ్యూజిక్ అలాగే ఓవర్సీస్, వీడియో హక్కులను 3కోట్లకు ఫోకస్ మీడియా, ఓల్గా దక్కించుకున్నాయి.

కర్ణాటక 3కోట్లు, కేరళ కోటి 25లక్షలు, ఇలా ప్రీ రిలీజ్ బిజినెస్ 36కోట్లు సాధించింది. 2012ఆగస్టు 9న వరల్డ్ వైడ్ 16వందల స్క్రీన్స్ మీద రిలీజ్ అయింది. ఉదయం ఆటనుంచే సూపర్ హిట్ టాక్. త్రివిక్రమ్ మ్యాజిక్, బన్నీ ఎనర్జిటిక్ యాక్షన్, కామెడీ, డాన్స్, సంగీతం, అన్నీ సూపర్భ్. బలమైన శత్రువుని చూపడం ద్వారా హీరోయిజం ని హైలెట్ చేయొచ్చన్న ఫార్ములా పనిచేసింది.

మొదటి రోజే ఏపీలో 8కోట్ల 50లక్షలు వసూలు చేసిన జులాయి మొదటి వారానికి 32కోట్లు, మొత్తంగా ఇండియాలో ఈ మూవీ ఇండియాలో 82కోట్లు, ఓవర్సీస్ తో కలిపి 103కోట్లు వసూలు చేసింది. ఉత్తమ జనాదరణ పొందిన సినిమాగా నంది అవార్డు, సోనూసూద్ కి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ కి , ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ కి నంది అవార్డులు వచ్చాయి. ఉత్తమ సహాయ నటుడిగా రాజేంద్రప్రసాద్ కి అవార్డు వచ్చింది.