MoviesTollywood news in telugu

Chiranjeevi:న్యాయం కావాలి సినిమాలో చిరు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!

Nyayam kavali Full Movie :మోసపోయిన ఆడవాళ్ళ జీవితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని ఓ విప్లవాత్మక ధోరణితో చేసిన సినిమాయే న్యాయం కావాలి మూవీ. చిరంజీవి, రాధిక నటించిన ఈ సినిమా క్రాంతి చిత్ర పతాకంపై క్రాంతికుమార్ నిర్మించాడు. ఏ కోదండ రామిరెడ్డి డైరక్షన్ చేసిన ఈ సినిమా ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది.

మగాడి చేతిలో మోసపోయి, పెళ్లి కాకుండా తల్లి అయిన భారతి పాత్ర లో రాధిక ఒదిగిపోయింది. కోర్టు కీడ్చి బుద్ధి చెప్పే విధానంలో సాగిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. సర్ధార్ పాపారాయుడు మూవీ తర్వాత చిరంజీవితో న్యాయం కావాలి మూవీని క్రాంతి కుమార్ ప్లాన్ చేసారు. ప్రాణం ఖరీదు తర్వాత క్రాంతికుమార్ , చిరు కాంబోలో వచ్చిన మూవీ ఇది.

అప్పటికే సంధ్య మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన ఏ కోదండరామిరెడ్డి తో రెండవ సినిమాగా న్యాయం కావాలి వచ్చింది. ఒకే చెప్పడంతో క్రాంతికుమార్ ఆనంద పడ్డారు. ఓ విధంగా చెప్పాలంటే చిరు, కొండరామిరెడ్డి కాంబినేషన్ కి ఈ మూవీ పునాది వేసింది. కథ కోసం కసరత్తు చేస్తుంటే, డి కామేశ్వరి రాసిన కొత్తమలుపు నవల కోదండ రామిరెడ్డి చదివి, క్రాంతికుమార్ చేతికిచ్చారు.

ఆయనకు కూడా నచ్చడంతో రెడీ అయ్యారు. మాధవిని హీరోయిన్ గా అనుకున్నా, అప్పటికే రెండు తమిళ సినిమాలు చేసిన రాధికను తీసుకున్నారు. దీంతో తెలుగులో ఆమె ఎంట్రీ స్టార్ట్ అయింది. ఓ పెద్ద డైలాగ్ ఆవేదనగా చెప్పడం చూసి, రాధికను శారద అభినందించడంతో ఆనందంతో ఉప్పొంగింది.

నవలను సినిమా తీయడం లో సక్సెస్ అయ్యారు. అయితే టైటిల్ కోసం ఆడపిల్ల, మోసం ఇలా చాలా టైటిల్స్ అనుకున్నా చివరికి న్యాయంకావాలి కన్ఫర్మ్ చేసారు. ఉదయం ఆట నుంచే హిట్ టాక్ వచ్చేసింది. 1981మే 15న చిరు, కోదండ రామిరెడ్డి కల్సి విజయవాడ జైహింద్ థియేటర్ లో ఆడియన్స్ తో కల్సి సినిమా చూసారు.

విశ్రాంతి సమయంలో ఇదేదో కొత్తగా ఉందని ఆడియన్స్ అనుకోవడం విని, ఆనందించమని కోదండరామిరెడ్డి ఒక సందర్భంలో చెప్పారు. ఈ మూవీ తరువాత చిరుతో కల్సి 23సినిమాలు చేశామని ఆయన తెలిపారు. మోసపోయిన తర్వాత పెళ్ళికి ఒప్పుకున్నా సరే, తిరస్కరించి సొంతంగా బతకగలనని నిరూపించే అమ్మాయి పాత్రలో రాధిక నటన అప్పట్లో చాలామందిలో మార్పు తెచ్చింది.

హీరోకి తల్లిదండ్రులైన శారద, జగ్గయ్య విడివిడిగా కేసులు వాదించడం, ఆడవాళ్లను మోసం చేసిన వాళ్లకు శిక్ష ఉండాలని శకుంతల పాత్రలో లాయర్ శారద చేసే వాదన, అవసరమైతే శిక్షాస్మృతిని మార్చాలని, అప్పుడే అనాధలుండరని కొత్త ముగింపు ఇచ్చిన సినిమా ఇది. చిరు నెగెటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ మెయిన్ పిల్లర్.

ఇక చివరిలో ఆడది ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుందన్న శ్లోకాన్ని స్వయంగా వేటూరి చేత చెప్పించడం ఓ హైలెట్. 5లక్షల బడ్జెట్. చిరు 30వ సినిమా ఇది. రెమ్యునరేషన్ 15వేలు. కోదండ రామిరెడ్డికి 5వేలు. దీన్ని తమిళంలో భాగ్యరాజా రీమేక్ చేయగా అక్కడ హిట్. కన్నడలో నిర్మించగా విజయశాంతి నటించింది. ఇక ఈ సినిమా విజయంపై 100రోజుల వేడుకలో డాక్టర్ దాసరి నారాయణరావు హర్షం వ్యక్తంచేస్తూ, కొత్త కోణంలో తీసారని అభినందించారు.