MoviesTollywood news in telugu

Tollywood:దసరా బుల్లోడులో ANR కన్నా వాణిశ్రీ ఎక్కువ పారితోషికం…నమ్మలేని నిజాలు

Dasara Bullodu Full Movie :అక్కినేని సరసన వాణిశ్రీ, చంద్రకళ నటించిన దసరా బుల్లోడు సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వి మదుసూదనరావు డైరెక్షన్ లో అక్కినేని తో వరుస చిత్రాలు తీసిన విబి రాజేంద్ర ప్రసాద్ తానే డైరెక్టర్ గా మారి తీసిన సినిమా ఇది. కృష్ణా జిల్లా డోకిపర్రు స్వగ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ కథకు దసరా బుల్లోడు టైటిల్ అనుకున్నారు.

అంతవరకూ అ ఆ లతో మొదలయ్యే ఆయన సినిమాలు అందుకు భిన్నంగా ఈ టైటిల్ పెట్టారు. నిజానికి మధుసూదనరావు కి ఖాళీలేదు, ఆదుర్తి సుబ్బారావు చేయనని చెప్పారు. చివరకు అక్కినేనినే డైరెక్ట్ చేయమని విబి రాజేంద్రప్రసాద్ అడిగారు. నీకు అనుభవం ఉంది నువ్వే చెయ్యి అని అక్కినేని సూచించడంతో సినిమాయే మానేద్దామని అనుకుని చివరకు డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు.

ఈ సినిమా షూటింగ్ లో భాగంగా 12రోజులు కృష్ణా జిల్లా లోని ఓ గ్రామంలో తీశారు. పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లోయ్ సాంగ్ స్టెప్స్ చూసి అక్కినేని చేసిన కామెంట్ తో రాజేంద్ర ప్రసాద్ కి తలతిరిగిపోయింది. సరదాగా అన్నానులే అని ఆతర్వాత అక్కినేని అనడంతో ప్రశాంతత వచ్చింది. అయితే 12రోజుల షూటింగ్ కెమెరాలో తేడా వలన 11రోజుల షూటింగ్ పోయింది.

దాంతో నానా తంటాలు పడి మళ్ళీ తీశారు. ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి సాంగ్ షూటింగ్ అమలాపురం ఏరియాలో 15రోజులు పెట్టుకున్నారు. అక్కడ జనాన్ని తట్టుకోవడం కష్టంగా మారింది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. ఆ ఊళ్ళో ఉన్న మరో వర్గం వారికీ దెబ్బలు తగలడం, ఘర్షణకు రావడంతో గొడవకు రాజేంద్రప్రసాద్ రెడీ అయ్యారు.

మొత్తానికి గొడవ సర్దుమణిగింది. మద్రాసులో ఫారిన్ కారు షోరూమ్ లొ మూలనపడిన కారుని కొని , హీరోకి ఉపయోగించడంతో ఆ కారు ప్రత్యేక ఆకర్షణ అయింది. 16వేలతో కొన్న ఈ కారు ఇసుకలో కూడా వెళ్లగలదు. ఈ కారు తో సినిమా ఫంక్షన్ కి వెళ్తే, హీరో హీరోయిన్స్ ని కల్పిన కారు అంటూ ఆడియన్స్ మంగళ హారతులిచ్చారు.

నాగార్జునతో తీసిన కెప్టెన్ నాగార్జున లో కూడా ఇదే కారు ఉపయోగించినట్లు ఈ ఫారిన్ కారు విశేషాల్లో భాగంగా రాజేంద్రప్రసాద్ చెప్పారు. అక్కినేనికి 15వేలు రెమ్యునరేషన్ ఇస్తే, రెట్టింపు వాణిశ్రీ అందుకుంది. నిజానికి జయలలితను హీరోయిన్ గా అనుకుంటే, ఏర్పాట్లు చేసుకోగా, చేయదని క్షమించాలని , ఆమె తల్లి ఉత్తరం రాయడంతో వాణిశ్రీకి ఖాళీ లేకపోవడంతో ఎలాగోలా ఒప్పించాలని ఆమె బంధువుకి 30వేలు ఇచ్చేసినట్లు రాజేంద్రప్రసాద్ అసలు విషయం చెప్పారు.

ఈ సినిమాతో వీరి కాంబో అదిరింది. అక్కినేని, వాణిశ్రీ 22 సినిమాలు కలిసి చేసారు. ఇక ఈ సినిమా విజయంతో 17 సినిమాలకు రాజేంద్రప్రసాద్ డైరెక్షన్ చేసారు. 25సెంటర్స్ లో 100, 4సెంటర్స్ లో 200రోజులు, ఒక సెంటర్ లో 365డేస్ ఆడింది. తమిళంలో తీస్తే ఆడలేదు, కానీ హిందీలో హిట్ అందుకుంది. ఇందులోని అక్కినేని స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణ. మహదేవన్ మ్యూజిక్ సూపర్భ్. దసరా బుల్లోడు స్టెప్స్ అనే పేరు వచ్చింది. హీరాలాల్ డాన్స్ కంపోజ్ చేసారు.