Healthhealth tips in telugu

Bananas:అరటిపండు…పచ్చిది…పండినది…బాగా మగ్గిన అరటిపండు…ఏది ఏ సమయంలో తింటే మంచిది

Banana Health benefits:సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ చాలా చవకగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. ఎన్నో పోషకాలు ఉన్న అరటిపండును చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు.

ఈ పండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అయితే ఈ పండు ఏ సమయంలో తినాలి.. అనే విషయానికి వస్తే… అరటిపండును ఉదయం సమయంలో పరగడుపున తీసుకోవచ్చు.

అరటిపండును రాత్రి సమయంలో సాధ్యమైనంత వరకు తినకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే రాత్రి సమయంలో తింటే జలుబు వచ్చే అవకాశం ఉంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మరియు మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా అరటిపండు తినకూడదు.

చాలా మంది పాలతో కలిపి అరటిపండును తీసుకుంటారు. లేదంటే పాలు తాగాక అరటిపండు తింటూ ఉంటారు. ఈ రెండు పద్ధతులు కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు.

అయితే అరటి పండ్లలో పచ్చివి, పండినవి, బాగా పండినవి ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే ఏ పండ్లను తింటే మన శరీరానికి పూర్తిగా పోషకాలు అందుతాయో తెలుసుకుందాం. స్నాక్స్ కోసమైతే అలాగే షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవి కావాలంటే మగ్గని అరటిపండును తీసుకోవాలి.

ఇందులో జీవక్రియ రేటును మెరుగుపరిచే ఫ్రీ బయోటెక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఆకలి కూడా తొందరగా తీరుతుంది.మగ్గిన అరటిపండు తియ్యగా ఉంటుంది. కానీ తిన్నా వెంటనే తేలికగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది.

బాగా మగ్గిపోయి మచ్చలు ఉన్న అరటిపండు చాలా చాలా తీయగా ఉంటుంది. దీనిలో ఇంకా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఏదైనా స్వీట్ తినాలని కోరిక ఉన్నవారు బాగా మగ్గిపోయి మచ్చలు ఉన్న అరటిపండును తింటే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.