Mosquito:కెమికల్స్ లేకుండా ఇంట్లో దోమల్ని చిటికెలో తరిమికొట్టండి
Mosquitoes remove tips in telugu : వర్షాకాలం మొదలైంది. వర్షాకాలం మొదలైందంటే దోమల బెడద కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. దోమలు కనపడగానే అందరు మస్కిటో కొయిల్స్ వెంట పడతారు. వాటి వలన కొన్ని సైడ్ ఎఫక్ట్స్ ఉంటాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి దోమలను ఇంటి నుండి తరిమి కొట్టవచ్చు.
దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అన్ని మనకు అందుబాటులో ఉండేవే. దోమలు కుట్టాయంటే దద్దుర్లు వచ్చి నొప్పి మంట వంటివి వస్తాయి. మనం ఈ చిట్కా కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఈ చిట్కా చేయటం కూడా చాలా సులువు. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటిలో ఒక్క దోమ కూడా ఉండదు.
4 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచి ఒక మట్టి పళ్ళెం లో వేసి దానిలో 3 కర్పూరం బిళ్లలను పొడి చేసి వేయాలి. ఆ తర్వాత అరస్పూన్ కొబ్బరి నూనె వేసి అగ్గిపుల్ల సాయంతో మంట పెట్టాలి. దాని నుంచి వచ్చే పొగకు దోమలు పారిపోతాయి. ఈ చిట్కా బాగా సహాయపడుతుంది.
ఘాటైన వాసనకు దోమలు చనిపోతాయి. దోమలు ఉన్న ప్రదేశంలో ఈ పొగను వేస్తే దోమలు చనిపోతాయి. వెల్లుల్లి, కర్పూరంలో ఉండే ఘాటైన వాసనకు దోమలు పోతాయి. ఈ మూడు మనకు ఇంటిలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ రెమిడీని ఫాలో అవ్వవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
https://www.chaipakodi.com/