Peanuts Vs Makhana:వేరుశనగ Vs మఖానా…రెండింటిలో బరువు తగ్గించటానికి ఏది మంచిది…?
Peanuts Vs Makhana :మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలను తగ్గించుకోవాలన్న, సమస్యలు రాకుండా ఉండాలన్నా తీసుకొనే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి మనం తీసుకునే ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి. ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉన్న ఆహారాలను స్నాక్ గా తీసుకుంటే ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది.
బరువు తగ్గాలని ప్రణాళికలో ఉన్నవారు వేరుశనగ మరియు మఖానా వంటి వాటిని తీసుకోవచ్చు. ఈ రెండింటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయకుండా చేస్తాయి. అలాగే నీరసం రాకుండా మన అవసరాలకు తగ్గట్టుగా శక్తిని కూడా అందిస్తాయి. అయితే వేరుశనగ, మఖానా… ఈ రెండింటిలో బరువు తగ్గించడానికి ఏది బెటర్ అనే విషయానికి వచ్చేసరికి…
ఎక్కువ ప్రోటీన్ తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండే వేరుశనగను అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది. వేరుశనగ ఆకలిని అదుపులో ఉంచి బరువు తగ్గటానికి సహాయపడుతుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. జీర్ణ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.
మఖానాలో మన శరీరానికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి పాషకాలు సమృద్ధిగా ఉంటాయి. మన శరీర బరువును నియంత్రించడానికి సహాయపడటమే కాకుండా కండరాలను బలపరుస్తుంది. క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మాఖనా బరువును తగ్గించటమే కాకుండా గుండె సమస్యలు, నిద్రలేమి, డయాబెటిస్, సంతానలేమి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
వేరుశెనగ మరియు మఖానా రెండింటిలోను సమానమైన పోషకాలు ఉంటాయి. ఇవి మనం అతిగా తినకుండా నివారించటమే కాకుండా అనారోగ్యకరమైన ఆహారాల పట్ల కోరికలను తగ్గిస్తాయి. కాబట్టి సాయంత్రం నలుగు గంటల సమయంలో రెండింటిని కలిపి తీసుకోవచ్చు. బరువు తగ్గటానికి రెండూ కూడా బాగా సహాయపడతాయి. కాబట్టి తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News