Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి అందుకున్న తొలి పారితోషికం ఎంతో తెలుసా…?
Chiranjeevi First remuneration: మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఎంతో మంది అభిమానుల మనస్సును గెలిచిన చిరంజీవి గురించి ఏ విషయం అయినా తెలుసుకోవటానికి అభిమానులు ముందు ఉంటారు. ఇప్పుడు చిరంజీవికి సంబందించిన ఒక విషయం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో మూడు దశాబ్దాలపాటు నెంబర్ వన్ స్థానంలో ఉండి తన రేంజ్ ఏంటో చూపించాడు. సినిమాల్లో స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి తన మొదటి సినిమాకు పారితోషకం 1116 రూపాయలు మాత్రమే. చిరంజీవి సినీ ప్రస్థానం 1978 సంవత్సరం పునాది రాళ్లు సినిమా తో ప్రారంభమైంది.
అయితే చిరంజీవి నటించిన మొదటి సినిమా పునాదిరాళ్లు అయినప్పటికీ మొదట ప్రాణం ఖరీదు అనే సినిమా విడుదలైంది. ఈ రెండు సినిమాలకు చిరంజీవి పారితోషికం తీసుకోలేదు మన ఊరి పాండవులు సినిమా కి 1116 రూపాయలు పారితోషికం తీసుకున్నారు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు విలన్ పాత్రలు చేస్తూ నిదానంగా హీరోగా టర్న్ అయ్యి మెగాస్టార్ అయ్యాడు.