Thotakura Vadalu: క్రిస్పీగా పప్పు, తోటకూర వడలు చిటికెలో చేసే చక్కటి తయారీ విధానం
Thotakura Vadalu: ప్రతి ఈవినింగ్ స్నాక్స్ కోసం, ఏదో ఒక ఐటెమ్ వెతుకుతూనే ఉండాలి. పకోడి బిస్కేట్స్, సమోస, లాంటివి కాకుండా, తమిళనాడు స్పెషల్ తోటకూర వడలు ట్రై చేయండి. కరకరలాడుతూ పర్ఫెక్ట్ స్నాక్స్ అనిపిస్తుంది.
కావాల్సిన పదార్ధాలు
పచ్చిశనగపప్పు – 1 కప్పు
మినపప్పు – 1/2కప్పు
పచ్చిమిర్చి – 2
వెల్లుల్లి రెబ్బలు -4
అల్లం తరుగు – తగినంత
తోటకూర తరుగు – 1 కప్పు
సోంపు – 1 టీ స్పూన్
తయారీ విధానం –
1.ఒక గిన్నెలోకి శనగపప్పు, మినపప్పు, వేసుకుని, శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి, నాలుగు గంటలు నాన పెట్టుకోవాలి.
2.నానిన పప్పులను వడకట్టి మిక్సీ జార్ లో వేసుకుని, కొద్దిగా నీళ్లు కలిపి బరకగా రుబ్బుకోవాలి.
3.ఆ గట్టి శనగపప్పు ముద్దలో, తోటకూర తరుగు, సోంపు, అల్లం తరుగు,పచ్చిమిర్చి,తగినంత ఉప్పు, వెల్లుల్లి వేసుకుని పిండి ముద్దలా కలుపుకోవాలి
4. ఆ పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని, అరటిఆకు పై నూనె వేసి పల్చని వడల్లాగ వత్తుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ పై మరో పాన్ పెట్టుకుని, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, బాగా వేడెక్కిన తర్వాత, తయారు చేసుకున్న వడలకు, మధ్యలో రంధ్రం చేసి వేడి నూనెలో ఒకోక్కటిగా వేసుకోవాలి.
6. మీడియం ఫ్లేమ్ పై వడలను రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని, తీయాలి.
7. అంతే కరకరలాడే Thotakura Vadalu రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News