Dandruff:షాంపూలు వాడినా ‘చుండ్రు’ పోవడం లేదా?.. ఈ ఇంటి చిట్కా పాటిస్తే రిజల్ట్స్ పక్కా!
Darndruff Home Remedies In telugu: జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. తక్కువ ఖర్చులో ఎక్కువ పలితాన్ని పొందవచ్చు. జుట్టు సమస్యలలో ఎక్కువగా చుండ్రు సమస్య వేదిస్తుంది.
చుండ్రు ఒకసారి వచ్చిందంటే అంత తొందరగా తగ్గదు. అలా అని షాంపూలు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి సహజసిద్దమైన పదార్ధాలతో చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు.
అందమైన నలుపు రంగు డ్రస్ వేసుకున్నప్పుడు భుజాలపై తెల్లగా చాక్‌పీస్ పొడిలా ఉండే పదార్థం కనిపిస్తే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో కదా.. అదే చుండ్రంటే. చుండ్రు సమస్య ఉన్నప్పుడు తలలో విపరీతమైన దురద వస్తుంది అంతేకాక చుండ్రు కారణంగా జుట్టు రాలిపోతుంది
ఇది తలలో తేమను పెంచి.. జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. జుట్టు కూడా సిల్కీగా, మెరుస్తూ ఉండేలా చేస్తుంది. దీనికోసం టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి తీసుకొని అందులో నిమ్మరసం, నీళ్లు కలిపి మిశ్రమంగా చేసుకొని తలకు అప్లై చేసుకోవాలి. దీన్ని అరగంట పాటు ఉంచుకొని తర్వాత తలస్నానం చేస్తే సరి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News