Beauty Tips

Dark circles : చింతపండుతో ఇలా చేస్తే డార్క్ సర్కిల్స్ దూరం..

Dark circles Home Remedies In Telugu: రాత్రిళ్లు కంటి నిండా నిద్రపట్టకపోయినా.. పని ఒత్తిడి, ఎక్కువ సేపు ల్యాప్‌టాప్ లేదా మొబైల్ స్క్రీన్‌ చూడటం.. వంటి పలు కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి

కంటి చుట్టూ నల్లటి వలయాలు వచ్చాయంటే ముఖం అందవిహీనంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది నల్లటి వలయాలతో బాధ పడుతున్నారు దీనికి గల కారణాలు గురించి చెప్పుకోవాలంటే ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవటం, హార్మోన్ల మార్పులు వంటివి చెప్పుకోవచ్చు.

వీటిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది దీని కోసం చాలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీనికోసం చింతపండు తీసుకుని నీటిలో ఒక అరగంట సేపు నానబెట్టి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.

ఈ పేస్ట్ లో కొంచెం నిమ్మరసం కలిపి కంటి చుట్టూ రాసి పది నిమిషాలయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు నుంచి మూడుసార్లు చేస్తూ ఉంటే క్రమంగా నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ చింతపండు పేస్టు లో గంధం లేదా పసుపు వేసి కూడా అప్లై చేయవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News